కోతి స్కార్ఫ్ లాగింది..యుద్ధం మొదలైంది…

Posted November 24, 2016

tribal war in southern Libya after monkey attack on schoolgirlకోతి పనికి చిన్నాచితకా ఇబ్బందులు రావడం సహజం.కానీ లిబియాలో మాత్రం రెండు తెగల మధ్య ఓ యుద్ధమే జరుగుతోంది.ఇప్పటిదాకా జరిగిన గొడవల్లో 20 మంది చనిపోయారు.ఇంకా చాలా మంది గాయపడ్డారు.ఇంతకీ ఇంతటి ఘోరానికి కారణం ఏంటో తెలుసా ?

సాభా లో నివసించే ఓ వ్యక్తి కోతులు పెంచుతుంటాడు.అతను పెంచిన కోతి స్కూల్ నుంచి వస్తున్న ఓ విద్యార్థిని స్కార్ఫ్ లాగింది.ఆ యువతి చేతిని కొరికింది. దీన్ని అవమానం గా భావించిన ఆమె తరపు వాళ్ళు కోతిని పెంచిన అతన్ని క్షమాపణ చెప్పాలన్నారు.అతను ఒప్పుకోలేదు..ఆ ఇద్దరు రెండు తెగలకు చెందినవాళ్లు కావడంతో వ్యవహారం ముదిరిపోయింది.వ్యక్తిగత వైరం కాస్త తెగల మధ్య యుద్ధమైపోయింది.రెండు తెగలవాళ్ళు హోరాహోరీ కాల్పులకు తెగబడ్డంతో ఇప్పటికే 20 మంది చనిపోయారు.60 మంది గాయపడ్డారు.గొడవకి కారణమైన కోతి కూడా కాల్పుల్లో చనిపోయింది.అక్కడ ఇక్కడ అని లేకుండా జాతి వైరం కోతిని మించిన జంతువని అర్ధం అర్ధం కావడం లేదూ!