నోట్ల రద్దు పై ఓటర్ తీర్పు..త్రిపుర లో బీజేపీ కి షాక్

Posted November 22, 2016

tripura by election bjp not win one assembly seatsబీజేపీ ప్రభుత్వం పై వ్యతిరేకత మొదలైందా ,నోట్ల రద్దు ఇందుకు కారణమా? అంటే ఆవును అనే ఫలితమే త్రిపురలో జరిగిన ఎన్నికల తీరు .నోట్ల రద్దు కారణం గా బీద మధ్య తరగతి అన్నివర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇప్పటికి 15 రోజులు గడిచినా నోట్ల కష్టాలు తీరలేదు ఫలితం గా ప్రభుత్వం అప్రతిష్ట మూట కట్టుకొంటోంది , నల్ల ధనాన్ని అరికట్టడం లో గట్టి నిర్ణయం తీసుకొన్న మోడీ సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లో విఫలం అయ్యిందనే చెప్పాలి. ముందుగా 2000 నోట్లు విడుదల చేయడం వల్ల ఆశించిన ప్రయోజనం లేక పోవడం చిన్న నోట్లు దొరక్క పోవడం రోజుల తరబడి బ్యాంకులు ఎటిఎం ల ముందు క్యూ కట్టడం వంటివి సామాన్య ప్రజల జీవితాల పైన తీవ్ర ప్రభావం చూపించాయి. ఇందుకు ఉదాహరణే ఈశాన్య రాష్ట్రము లో జరిగిన మధ్యంతర ఎన్నికలే ఇప్పటికే ఉభయ సభల్లో బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్న సిపిఎం ఈ ఎన్నిక ఫలితాలతో మరింత ఊపుని కొనసాగించే అవకాశం దక్కించుకొంది

త్రిపుర లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. మొత్తం రెండు అసెంబ్లీ స్థానాలను సీపీఎం కైవసం చేసుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత జరిగిన తొలి ఉప ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈ నెల 19న మొత్తం 13 చోట్ల నాలుగు పార్లమెంటు స్థానాలు, 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను జరగ్గా మంగళవారం ఫలితాలు వెల్లడయ్యాయి .