హమ్మో.. ట్రంప్‌ అలానా…!

Posted November 9, 2016
trump inner viewsఇండియాలో నోట్లు లెక్కేస్తుంటే… అమెరికాలో ఓట్లు లెక్కేస్తున్నారు.. మన లెక్క తేలకున్నా.. వాళ్ల లెక్కలో కొంత స్పష్టత కనిపిస్తుంది.. ముందస్తు సర్వేలన్నీ డెమక్రటిక్‌ పార్టీ అధ్యర్థి హిల్లరీవైపు మొగినా.. ఫలితాల తీరు చూస్తుంటే రిపబ్లికన్‌ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. 538 స్థానాల్లో ఎన్నికలు జరగ గా 459 స్థానాల్లో కౌంటింగ్‌ ప్రారంభమైంది.. ఇప్పటి వరకు ఉన్న సమాచారంతో భారత కాలమానం ప్రకారం ఉ. 11.50 గంటలకు  244 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.. హిల్లరీ 215స్థానాల్లో ఆధిక్యంలో ఉండి వెనుకంజలో ఉన్నారు.. మ్యాజిక్‌ ఫిగర్‌ 270కి ట్రంప్‌ చేరువలోకి రావడంతో రిపబ్లికన్‌ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి.. విజయంపైనా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎగ్జిట్‌ ఫోల్స్‌ సైతం అనుకూలంగా ఉన్నా ఈ స్థాయిలో ఆధిక్యం ఉంటుందని అంచనా వేయలేకపోయాయి.. దాంతో పార్టీకి కొండత ధైర్యం వచ్చింది.. ఓటమి భయం ఒదిలి ఆధిక్యం ఎంతొస్తుందా అనేది లెక్కస్తున్నట్లు అనుకూల వర్గం వెల్లడిస్తుంది. ఇప్పటి వరకు లెక్కించని రాష్ట్రాల్లో రిపబ్లికన్‌ పార్టీకి పట్టుఉండటంతో మొత్తం స్థానాలు 280 నుంచి 301 వరకు అంచనా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రచార కర్త ఉన్న తెలుగువాడు అవినాష్‌ వెల్లడించారు. దీన్ని బట్టి వాళ్లెంత ధీమాగా ఉన్నారో అర్థంచేసుకోవచ్చు..