ట్రంప్ కళ్లని అది కప్పేసిందా?

Posted October 14, 2016

 trump said Will be dating her In 10 Years
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విధానాలు పక్కకిపోయి వ్యక్తిగత అంశాలు ప్రాధాన్యంలోకి వస్తున్నాయి.ప్రత్యర్థి హిల్లరీ భర్త శృంగార లీలల్ని గుర్తు చేసి ఓట్లు కొట్టేద్దామనుకున్న ట్రంప్ నిండా సెక్స్ స్కాండల్స్ లో మునిగిపోయాడు.మరుగున పడ్డ అయ్యగారి లీలలు గుర్తు చేస్తూ ఒక్కో మహిళ ముందుకొస్తుంటే వారి అనుభవాలు విని అమెరికన్లు షాక్ తింటున్నారు.అన్నిటికన్నా ఘోరమైన రెండు విషయాలు మాత్రం ట్రంప్ కళ్ళకి నిత్యం కామపొరలు కప్పివుంటాయని అర్ధమయ్యేలా చేసింది.

ఒకటి సొంత కూతురి అందాన్ని వర్ణించిన తీరు అయితే..మరొకటి తాజాగా వెలుగు చూసిన వీడియో క్లిప్పింగ్ లోని మాటలు.ఓ చిన్నారిని చూసి ఆమె వయసుని కూడా పట్టించుకోకుండా కొన్నేళ్ల తర్వాత ఆమె ఎలా ఉంటుందో వివరించి ఆమెతో అప్పుడు డేటింగ్ కి వెళ్తానని ట్రంప్ వ్యాఖ్యల్ని జనం చీదరించుకుంటున్నారు. అధ్యక్ష పదవి మాట సరే కనీసం వయసుకి తగ్గట్టు వ్యవహరించే బుద్ధి కూడా ఈయనకి లేదని డిసైడ్ అయిపోయారు.అంతే మరి కళ్ళకి కామపు మాస్క్ వేసుకు తిరిగితే ఎప్పుడోకప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి.

[wpdevart_youtube]0TL-G_l5VV0[/wpdevart_youtube]