ట్రంప్ కి ఇంటి పోరు ..వీధిన పడ్డ రిపబ్లికన్లు

 trump shocked republican party politician leaders
డోనాల్డ్ ట్రంప్‌పై స్వంత పార్టీలోనే తిరుగుబాటు తీవ్ర‌మైంది. రిప‌బ్లిక‌న్ పార్టీ సీనియ‌ర్లు ట్రంప్‌కు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌నుకుంటున్నారు. అమెరికా చ‌రిత్ర‌లోనే ట్రంప్ అత్యంత నిర్ల‌క్ష్య‌పు అధ్య‌క్షుడు అవుతార‌ని రిప‌బ్లిక‌న్లు భావిస్తున్నారు. రిప‌బ్లిక‌న్ జాతీయ భ‌ద్ర‌తా ద‌ళ నిపుణులు స‌మారు 50 మంది ట్రంప్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. వాళ్లంతా ఓ లైఖ‌పై త‌మ నిర‌స‌న గ‌ళాన్ని వినిపిస్తున్నారు. ఆ బృందంలో సీఐఏ మాజీ డైరక్ట‌ర్ మైఖేల్ హేడ‌న్ కూడా ఉన్నారు.

అమెరికా ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున అధ్య‌క్షుడిగా పోటీప‌డ‌నున్న ట్రంప్‌లో మాన‌వ‌తా విలువ‌లు లోపించాయ‌ని ఆ పార్టీ వ‌ర్గీయులంటున్నారు. స్వ‌భావం, విలువలు, అనుభ‌వం లేని వ్య‌క్తి ట్రంప్ అంటూ ఆ పార్టీ సీనియ‌ర్లు ఆరోపిస్తున్నారు. పార్టీ సీనియ‌ర్లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై ట్రంప్ త‌న‌దైన స్టయిల్లో స్పందించారు. రిప‌బ్లిక‌న్ నిపుణులంతా విఫ‌ల‌మైన నేత‌లంటూ వ్యాఖ్యానించారు.

ఎన్నో ఏళ్లుగా ప‌టిష్ట విదేశీ విధానాన్ని అవ‌లంబిస్తున్న రిపబ్లిక‌న్ పార్టీ ప‌రువును ట్రంప్ దిగ‌జారుస్తున్నార‌ని మ‌రోవైపు సీనియ‌ర్లు విమ‌ర్శించారు. నాటో ద‌ళాల ప‌ట్ల అమెరికా అందిస్తున్న స‌హాకారాన్ని ట్రంప్ ప్ర‌శ్నించారు. ట‌ర్చ‌ర్ ప‌ద్ద‌తుల‌ను కూడా ట్రంప్ స‌మ‌ర్థించారు. ద‌క్షిణ కొరియా, జ‌పాన్ దేశాలు అణ్వాయుధాల‌ను స‌మీక‌రించుకోవాలిని ట్రంప్ అభిప్రాయ‌ప‌డ్డారు. దాంతో ట్రంప్ తీరు ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. అమెరికా రాజ్యాంగం తెలియ‌ని వ్య‌క్తి అంటూ రిప‌బ్లిక‌న్ తాము రాసిన లేఖ‌లో ట్రంప్‌పై విరుచుకుప‌డ్డారు. మేం ఎవ్వ‌రమూ ట్రంప్‌కు ఓటు వేయ‌మ‌ని రిప‌బ్లిక‌న్ నేత‌లంతా ఆ లేఖ‌లో సంత‌కం చేశారు.

ట్రంప్‌కు ఓటు వేయ‌రాద‌ని డిసైడ్ అయిన రిప‌బ్లిక‌న్ల లిస్టులో బార్బ‌రా బుష్‌(మాజీ ఫ‌స్ట్ లేడీ), జెబ్ బుష్ (మాజీ ఫ్లోరిడా గ‌వ‌ర్న‌ర్‌), విలియ‌మ్ కోహెన్ (మాజీ ర‌క్ష‌ణ‌శాఖ కార్య‌ద‌ర్శి), జెఫ్ ఫ్లేక్ (ఆరిజోనా సేనేట‌ర్‌), లిండ్సే గ్ర‌హ‌మ్‌(సౌత్ క‌రోలినా సేనేట‌ర్‌), లారీ హోగ‌న్‌(మేరీలాండ్ గ‌వ‌ర్న‌ర్‌)తో పాటు మ‌రికొంత మంది ప్ర‌ముఖులు ఉన్నారు.