అమెరికాలోఇక వాళ్లకి తప్ప ఎవరికీ చోటు లేదా?

Posted February 1, 2017

trump thinking in america country living only americans that's why trump cancel h1b visa
హెచ్ 1 బి వీసాల విషయంలో విదేశీ ఐటీ కంపెనీలకి షాక్ ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్ దూకుడుని అమెరికాలోని కొన్ని వర్గాలు అందిపుచ్చుకుంటున్నాయి.ట్రంప్ అధికారంలో ఉండగానే ముస్లిమ్స్,ఇండియన్స్,బ్లాక్స్,యూదులు …ఇలా అందర్నీ బయటికి పంపి కేవలం వైట్స్ మాత్రమే వుండే అమెరికాని సాధించుకోవాలని సోషల్ మీడియా ద్వారా కొందరు ప్రచారం మొదలెట్టినట్టు తెలుస్తోంది. టెక్సాక్ కేంద్రంగా మొదట ఈ పని మొదలెడితే మిగతా ప్రాంతాల్లో ఆ పని ట్రంప్ పూర్తి చేస్తాడంటూ పిలుపునిచ్చిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.

ఈ లేఖని ఎవరు ప్రచారంలోకి తెచ్చారో తెలియకపోయినా అందులో అంశాలు మాత్రం ఆందోళన రేకెత్తించేలా వున్నాయి.ఈ లేఖని ఓ హెచ్చరికగా తీసుకుని బయటకు వెళ్లకుండా వుండే విదేశీయులు అమెరికాలో వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా అందులో వార్నింగ్ ఇచ్చారు.ఈ లేఖ నిజమైతే అమెరికా లో అసహనం పతాక స్థాయికి చేరినట్టే ..

trump thinking in america country living only americans that's why trump cancel h1b visa