ఒక సత్యం…జయ జీవితమే సాక్ష్యం

Posted December 11, 2016

truth in jayalalitha lifestory

 • కోటానుకోట్ల ఆస్తులు,బంగ్లాలు ,బంగారం, ఆమె సొంతం ,
 • చిటికేస్తే రాష్ట్రాన్ని గడగడ లాడించే బలగాలు ఆమె కనుసన్నల్లో ,
 • అవసరమైతే అంతరిక్షం నుండి కూడా వైద్యులను పిలిపించుకుని చికిత్స చేయించుకునే పరపతి పలుకుబడి ఆమె సొంతం,
 • శరీరంలోని ప్రతి అవయవాన్ని మార్చుకోగల , ఆమె కోసం దానం చేయగల అభిమానులు ఆమె సొంతం ,
 • ఎన్ని ఉన్నా ,
  ఎంత సంపాదించినా,
  ఎంత బలగం ఉన్నా ,
 • వెళ్లాల్సిన సమయం వచ్చినపుడు
  ఏ ఒక్క అంశం అడ్డుకోలేదు.
 • అన్ని వదిలేసి
 • కాదు కాదు
 • అన్ని వదిలి వేయబడిన ఒక మోడులా ,
 • తలవంచుకుని ఓటమిని అంగీకరించి మౌనంగా ,ఒంటరిగా, వెళ్లిపోవలసిందే….
  ఈ మాత్రం దానికే ఇంత కోపాలు,కక్షలు,అంతస్తులపై అధికారంపై ఆశలు ,వాటికోసం కుట్రలు
  ప్రతిరోజూ పాకులాటలు
 • ఒక ప్రశాంతమైన జీవితం ఉంటే చాలదా…

-వెంకి