అక్కడ పుచ్చకాయ తింటే చిరుత పులొస్తుంది..

0
81

Posted April 20, 2017

ttd bans watermelon in tirumala because of chirutha
అక్కడ పుచ్చకాయ తింటే చిరుత పులి వచ్చేస్తుంది.ఇదేదో మయమంత్రాలు వున్న చోటు కాదు. నిత్యం శ్రీవారి భక్తులతో కళకళలాడే తిరుమలలో.నమ్మకశ్యంగా లేకున్నా ఇది నిజం.భక్తులు ఎండకి తాళలేక చల్లగా పుచ్చకాయ ముక్కలు తిందామనుకుంటే అవి కొండ మీద దొరకనే దొరకవు.అలా చేసింది ఎవరో కాదు.స్వయంగా టీటీడీ కొండ మీద పుచ్చకాయలు అమ్మకుండా చర్యలు చేపట్టింది. పుచ్చకాయలు తింటే చిరుత పులిని పిలిచినట్టేనని భావించి ఈ నిర్ణయానికి వచ్చింది.ఇంత చిత్రమైన నిర్ణయం వెనుక అంత కన్నా చిత్రమైన కారణం వుంది.అదేంటో తెలుసుకుందాం ..

కొండ మీద భక్తులు తినిపడేసే పుచ్చకాయ బద్దల తోలు మందంగా ఉంటుంది.వాటి రుచి జింకలకి బాగా ఇష్టం.పైగా వాటి ఆకలి కూడా ఈ మందపాటి పుచ్చ తోలు వల్ల తేలిగ్గా తీరుతుంది. అందుకే వేసవి సీజన్లో కొండ మీద భక్తులు పారేసే పుచ్చ తొక్కల కోసం జింకలు అరణ్య ప్రాంతం నుంచి వస్తాయి.వాటి కోసమే కాచుకు కూర్చునే చిరుతలు వేట కోసం వచ్చేస్తాయి.దాని వల్ల జింకలతో పాటు శ్రీవారి భక్తులకు కూడా ప్రమాదం.దీన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పుచ్చకాయలు మీద బ్యాన్ పెట్టింది,ఇప్పుడు చెప్పండి తిరుమల కొండ మీద పుచ్చకాయ తింటే చిరుత పులిని పిలిచినట్టా..కాదా?