మలయాళ నటి రేఖ మోహన్ అనుమానాస్పద మృతి

Posted November 13, 2016

rekhaమలయాళ సినీ, టీవీ నటి రేఖా మోహన్‌ మరణించింది. శనివారం కేరళలో త్రిసూర్‌లోని రేఖ అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అకస్మాతుగ రేఖ మృతికి కారణమేంటన్నది తెలియరాలేదు. ఆమె పలు మలయాళీ సినిమాలు, టీవీ సీరియల్‌లో నటించింది.ఇంటికి దూరంగా ఉన్న రేఖ భర్త గత రెండు రోజులుగా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఆయనకు సందేహం వచ్చి త్రిసూర్‌ పోలీసుల సాయం కోరాడు. పోలీసులు రేఖ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తలుపులు పగలకొట్టి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. అపార్ట్‌మెంట్‌ లోపల లాక్‌ చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త్రిసూర్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు.

రెండు రోజుల క్రితం తమిళ సినీ పరిశ్రమలోనూ ఇలాగే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నటి సబర్ణ చైన్నైలోని తన ఫ్లాట్‌లో మరణించినట్టు పోలీసులు కనుగొన్నారు. మూడు రోజుల క్రితం చనిపోయినట్టు తెలిపారు. ఆమె లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు..చిత్ర రంగానికి చెందిన వారు ఇలా వరుస గ మృతిచెందడం సినీ రంగాన్ని దిగ్బ్రాంతికి  గురి చేసింది