ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ పైలట్ లు అమ్మాయిలే…

Posted December 2, 2016

 

అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆ మెట్రో రైలును నడిపించింది ఇద్దరు యువతులు. మొదటిసారిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేటప్పుడు మెట్రో రైలును మహిళలు నడిపేందుకు లఖ్‌నవూ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఎంఆర్‌సీ) అంగీకరించింది. మహిళా ట్రైన్‌ ఆపరేటర్లు దీన్ని నడిపేందుకు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఆసక్తిగా ఎదురుచూశారని ఎల్‌ఎంఆర్‌సీ ఎండీ కుమార్‌ కేశవ్‌ వెల్లడించారు. ఈ అమ్మాయిలు దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌లో శిక్షణతీసుకున్నారట

దేశంలోనే మొదటి సారిగా మహిళా ట్రైన్‌ ఆపరేటర్లతో మెట్రో రైలును నడిపించిన ఘనత లఖ్‌నవూ మెట్రో అధికారులకు దక్కింది. అలహాబాద్‌కు చెందిన ప్రతిభ, ప్రాచి శర్మ ఎంతో ధైర్యసాహసాలతో మెట్రో ట్రయల్‌ రన్‌లో ట్రైన్‌ ఆపరేటర్లుగా వ్యవహరించారు. అలహాబాదులోని ఎస్‌ఆర్‌ఎంఎస్‌సీఈటీలో ప్రతిభ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ చదవగా, ప్రాచి ఐఈఆర్‌టీలో ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ డిప్లమా పూర్తి చేసింది. వీరిద్దరూ ఎల్‌ఎంఆర్‌సీ స్టేషన్‌లో కంట్రోలర్‌ కమ్‌ ట్రైన్‌ ఆపరేటర్స్‌గా జూన్‌ 9న చేరారు. లఖ్‌నవూ మెట్రోలో ట్రైన్‌ ఆపరేటర్స్‌గా 98 ఖాళీలు ఉండగా, పలువురు మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు.