లోకేష్ ని పప్పు అనొచ్చా..మరి మిమ్మల్ని ఉండవల్లీ?

0
74

Posted April 26, 2017 at 16:39

undavalli arunkumar said all are call to nara lokesh pappu
ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ కలుగులో నుంచి బయటికి వచ్చాడు.ఎవరూ అడక్కుండానే ఓ గొప్ప విషయం కూడా చెప్పేసారు.లోకేష్ ని పప్పు అనడంలో తప్పు లేదని.పైగా ఈ విషయంలో ఏపీ సర్కార్ ఇంత రాద్ధాంతం చేయడం అనవసరమని కూడా సెలవిచ్చారు.రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాల్లో ప్రభుత్వానికి లేఖలు రాసినా ఏ మాత్రం ప్రతిస్పందన ఇవ్వడం లేదని కూడా ఉండవల్లి వాపోయారు.అబ్బా అబ్బా ఇన్నాళ్లకు బయటకు వచ్చిన ఉండవల్లి గారు చెప్పిన మాటలు వింటుంటే మైండ్ బ్లాంక్ అవుతోంది.కానీ ఉండవల్లి గారి మాటలు చూస్తుంటే చాలా డౌట్ లు వస్తున్నాయి.వాటికి ఏదైనా సమాధానం ఇవ్వగలరేమో చూడండి..

1 . లోకేష్ ని పప్పు అన్నందుకు కేసు పెట్టారా లేక శాసనమండలిని పెద్దల సభగా కాక ఏ సర్టిఫికెట్ సినిమాగా ప్రొజెక్ట్ చేసినందుకా ?

2 . సరే లోకేష్ ని పప్పు అనొచ్చని చెప్పారు కదా…టీవీలు,పేపర్ లలో వందలవేల సార్లు తెలంగాణ రాదు కాక రాదు అని కోట్లాది మంది ఆంధ్రుల్ని నిలువునా ముంచిన మిమ్మల్ని మోసకారి,అబద్ధాల కోరు అనొచ్చా ?

3 . ప్రభుత్వం మీ లేఖలకి సమాధానం ఇవ్వడం లేదంటున్నారు సరే …కోర్టులో విభజన చెల్లదని కేసు వేసాను,త్వరలో తీర్పు మనకి అనుకూలంగా వస్తుందన్నారు .ఆ “త్వరలో” ఎప్పటికొస్తుందో చెప్పగలరా ? లేక కమల్ హాసన్ సినిమా మరుదనాయగం ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడు మీరు ఈ కేసు గెలుస్తారు అనుకోవచ్చా ?

4 . వయసుతో అనుభవం,అనుభవంతో పెద్దరికం,పెద్దరికంతో రెండు వైపులా ఆలోచించి మాట్లాడాలన్న విచక్షణ కలుగుతుంది కదా …ఓ మేధావిగా పేరు పడ్డ మీరే దాన్ని మరిచి లోకేష్ ని పప్పు అనమంటే …మిమ్మల్ని పెద్దగా చదువుకోని,తెలివితేటలు లేని వాళ్ళు ఏమైనా అంటే మీరు కూడా మౌనంగా ఊరుకుంటారా?

5 . పోలవరం మీద ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు..ఆ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని చెప్పిన వై.ఎస్,కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో వున్నప్పుడు మీ గొంతెందుకు పెగల్లేదు ఉండవల్లి గారూ?

ఏదో అమాయకత్వం,తెలియని తనంతో మీలాంటి మేధావికి ఇంత అల్పమైన ప్రశ్న వేస్తున్నందుకు మన్నించండి.కానీ ఓ విషయం సార్…పై ప్రశ్నల్లో ఒక్కదానికైనా మీరు నేరుగా,డొంక తిరుగుడు లేకుండా సమాధానం చెప్పండి…ప్లీజ్