ఉండవల్లి బతికుండగానే ఆ కేసులు కోర్టుకొస్తాయి..

0
472

 Posted October 18, 2016

  undavalli put case on chandrababu
మాజీ ఎంపీ ఉండవల్లి కూడా ఆ జాబితాలో చేరిపోయారు.ఇంతకీ అది ఏ జాబితా అంటే …చంద్రబాబుకి,కోర్టు తీర్పులకి లంకె పెట్టే జాబితాలో చేరిపోయారు. అయితే మేధావి కాబట్టి తన అభిప్రాయాల్ని కాస్త తెలివిగా చెప్పారు.

1.చంద్రబాబు కోర్టుల విషయంలో చాలా లక్కీ
2.బాబుకి కోర్టుల్లో ఏమీ కాదనే అభిప్రాయం వుంది.
3 .ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోర్టులని మేనేజ్ చేయగలరని తెలంగాణ అడ్వకేట్ జనరల్ వ్యాఖ్యానించారు.
ఇలా చెప్తున్న వుండవల్లిని బాబు ప్రభుత్వం పై కేసులేమైనా వేస్తారా అని విలేకరులు ప్రశ్నించారు.ఇప్పటికే బాబు ప్రభుత్వం మీద మూడు కేసులు వేశా….నేను బతికుండగానే అవి రీచ్ అవుతాయని ఆశిస్తున్నట్టు ఉండవల్లి చెప్పారు.ఏదైనా ఉండవల్లి లాయర్ అనిపించుకున్నారు.