జగన్ ప్రయత్నం వేస్ట్ అన్న ఉండవల్లి ..ఎందుకు?

    undavalli said jagan special status trying waste
          ఏపీ కి ప్రత్యేక హోదా సాధించేందుకు రెండేళ్లు అయినా పోరాడుతానని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఊహించని రీతిలో స్పందించారు.

జగన్ ఎంత పోరాడినా ప్రయోజనం లేదని అయన తేల్చి చెప్పారు.అదే సమయంలో ఉండవల్లి ఓ కీలక సలహా ఇచ్చారు.ప్రజాస్వామ్యంలో మెజారిటీ కే విలువ కాబట్టి బీజేపీ ,టీడీపీ కూటమిని ఓడించడానికి వైసీపీ,కాంగ్రెస్ ,కమ్యూనిస్టులు కలిసి పోటీ చేయాలని ఉండవల్లి సూచించారు.మున్సిపల్ ఎన్నికల్లోనే ఆ పని చేస్తే …ఓటమితో బీజేపీ,టీడీపీ కి బుద్ధి వస్తుందని అయన అన్నారు.తద్వారా అంతా మంచే జరుగుతుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

        ఓ పదిపదిహేను రోజుల కిందటే కాంగ్రెస్ తో కలిసి పని చేసే అవకాశం లేదని వైసీపీ కుండబద్ధలు కొట్టాక ఉండవల్లి ఈ సలహా ఇవ్వడం వెనుక ఎవరున్నారా అని ఆరా తీస్తే వై.ఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ హ్యాండ్ గురించి బయటకు పొక్కింది.కాంగ్రెస్ హైకమాండ్ మళ్లీ జగన్ ని దగ్గరకు తీసే భాధ్యతను కేవీపీ కి అప్పజెప్పిందట.అది విలీనం లేదా పొత్తు ఏదైనా ఫర్లేదని రెండు ఆప్షన్స్ కూడా ఇచ్చిందట.అప్పటినుంచే కేవీపీ,ఆయనకు కుడి భుజం లాంటి ఉండవల్లి ఓ లక్ష్యంతో జగన్ కి అనుకూలంగా వ్యవహరించడం మొదలెట్టినట్టు తెలుస్తోంది.ఈ ప్రతిపాదన పై జగన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట.ఇంతలో ఉండవల్లి మున్సిపల్ ఎన్నికల్లోనే పొత్తుల ప్రస్తావన తెచ్చారు.కాంగ్రెస్ కి దగ్గర అయితే విభజన పాపం చుట్టుకుంటుందన్న భయం ఓ వైపు…ఏ జాతీయ పార్టీ అండ లేకుండా హోదా ఎలా సాధ్యమన్న ప్రశ్నకి సమాధానం దొరకదని  మరోవైపు జగన్ ఆలోచిస్తున్నారు .కొన్ని ఇబ్బందులున్నా ఏదో ఒక నిర్ణయం తీసుకోడానికే జగన్ డిసైడ్ అయ్యారట.