అతని బూట్లు కోట్లు పలికాయి..

   usain bolt shoes 1 crore 21 lakhsజ‌మైక‌న్ స్ప్రింట్ స్టార్ ఉసేన్ బోల్ట్ ట్రాక్ మీద‌నే కాదు.. ఆఫ్ ట్రాక్ కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు. బీజింగ్‌లో 2015లో జ‌రిగిన ప్ర‌పంచ ఛాంపియ‌న్‌షిప్ సంద‌ర్భంగా బోల్ట్ వేసుకుని ప‌రిగెత్తిన బూట్ల‌ను ఆన్‌లైన్‌లో వేలం వేశారు. ఈ బూట్ల‌పై బోల్ట్ ఆటోగ్రాఫ్ కూడా ఉంటుంది. 8వేల యూరోల‌తో ఆన్‌లైన్‌లో వేలంపాట మొద‌ల‌వ‌గా… చివ‌ర‌కు 16వేల యూరోల‌కు అమ్ముడుపోయాయి. మ‌న క‌రెన్సీలో అయితే రూ.60 ల‌క్ష‌ల‌కు ప్రారంభ‌మై రూ. కోటి 21 ల‌క్ష‌ల వ‌ద్ద ఆక్ష‌న్ ముగిసింది.

రియో ఒలింపిక్స్‌లోమొత్తం మూడు స్వ‌ర్ణాలు సాధించి మూడు వ‌ర‌స ఒలింపిక్స్‌లో ట్రాక్ ఈవెంట్స్‌లో మూడు స్వ‌ర్ణాలు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు బోల్ట్‌. రియో ఒలింపిక్స్ విజ‌యంతో గ్రాండ్‌గా త‌న కెరీర్‌కు ముగింపు ప‌లికాడు ఉసేన్ బోల్ట్‌.