ఉత్తమ్ ను టెన్షన్ పెడుతున్న కోమటిరెడ్డి!!

Posted December 14, 2016

uttam is tensed by komatreddyకాంగ్రెస్ హయాంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా పనిచేశారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్పట్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే హైకమాండ్ ఆయన రాజీనామా చేసిన స్థానంలో అదే జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం వచ్చింది. ఆయన మంత్రి కూడా అయిపోయారు. ఆ తర్వాత అదే పరపతితో పీసీసీ చీఫ్ అవకాశాన్ని కూడా దక్కించుకున్నారాయన. అయితే రేసులో వెనుకబడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ వేగం పెంచారు. పీసీసీ చీఫ్ అవకాశం కూడా ప్రయత్నించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల నాటికి తాను కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్పుకొచ్చారు.

మీడియాలో కోమటిరెడ్డి మాటలు ఈ మధ్య హైలైట్ అయ్యాయి. దీంతో ఉత్తమ్ తో పోలిస్తే.. కోమటిరెడ్డికి కొంత మైలేజ్ పెరిగిందని కాంగ్రెస్ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఉత్తమ్ కంటే ఆయన వాయిస్ లోనే బలముందట. అసలు పీసీసీ చీఫ్ ఉత్తమా… లేకపోతే కోమటిరెడ్డా అన్నంతగా చర్చ నడుస్తోంది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి టెన్షన్ పడుతున్నారని సమాచారం.

జరుగుతోంది చూస్తుంటే పీసీసీ చీఫ్ పదవికే ఎసరొచ్చే ప్రమాదం ఉందా అని డౌట్స్ వస్తున్నాయట కాంగ్రెస్ లో . అసలే కాంగ్రెస్ హైకమాండ్ ఏ టైమ్ లో ఏ డెసిషన్ తీసుకుంటుందో తెలియదు.. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇక గట్టిగా ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నారట ఉత్తమ్. ఇలాగైనా కోమటిరెడ్డిని వెనుకకు నెట్టేయాలని ఉత్తమ్ ప్లాన్ చేశారని టాక్.