మోడీకి షాకిచ్చిన బాహుబలి!!

Posted February 4, 2017

uttarakhand cm harish rawat posted bahubali spoof video modi shocked
రాజకీయ పార్టీలు ఓటర్ల‌ను ఆకట్టుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటాయి. ఒక్కోసారి అవి కించెం డిఫరెంట్ గా ఉండి… మంచి ప్రచారాన్ని తెచ్చిపెడతాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోనూ ఇలాంటి ప్రయత్నమే జరిగింది. బాహుబలికి పేరడీగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. స్వయంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావతే దాన్ని పోస్ట్ చేయడం విశేషం.

బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తే సీన్ గుర్తుందా.. ఆ సీన్ కే పేరడీ చేశారు రావత్. ఎడిటింగ్ లో సినిమాలోని పాత్ర‌ల ప్లేసులో రాజ‌కీయ నాయ‌కుల‌ను చేర్చేశారు. ప్రభాస్ పాత్రలో హరీశ్ రావత్ కనిపించారు. తనికెళ్ల భరణి ప్లేసులో నరేంద్రమోడీని యాడ్ చేశారు. ఇక పక్కనే అమిత్ షా కూడా హరీశ్ రావత్ ను చూసి వణికిపోతున్నట్టుగా ఎడిట్ చేశారు. మొత్తానికి ఈ వీడియో పుణ్యమాని నేషనల్ ఛానల్స్ లో హరీశ్ రావత్ మంచి ప్రచారమే లభించింది. అటు జనంలోనూ ఈ వీడియో గురించే చర్చ జరుగుతోంది.

ఈ వీడియోలో రావత్ కు ఎదురుగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉంటుంది. బాహుబలిలో ప్రభాస్‌ శివలింగాన్ని ఎలా ఎత్తుకుంటాడో అతడిని మించిన స్థాయిలో ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ హరీశ్‌ కూడా ఉత్తరాఖండ్‌ భాగాన్ని తన భుజాలకు ఎత్తుకుంటాడు. అది చూసి అమిత్‌ షా అవాక్కవుతాడు. మోడీ ఆశ్చర్యపోయి చూస్తుంటాడు.

బాహుబ‌లి మార్క్ రాజ‌కీయం చూసి ఇప్పుడు అన్ని పార్టీలు ఫిదా అవుతున్నాయి. నిజంగానే హ‌రీశ్ రావ‌త్ ఎత్తుగ‌డ సూప‌ర్ అని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ప్ర‌జ‌ల‌పై ఎంతో కొంత ప్ర‌భావం చూపించ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ … రావ‌త్ కు క‌రెక్ట్ గా సూట‌య్యింద‌ని అంద‌రూ చెబుతున్నారు.

రియల్ లైఫ్ లో హరీశ్ రావత్ … మోడీకి షాకిస్తారో లేదో..కానీ రీల్ లైఫ్ లో షాక్ ఇచ్చేశారు. అందుకే కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ వీడియోను చూసి ఇన్ స్పైర్ అవుతున్నారట. వీడియోలో లాగా రావత్ నిజంగానే… మోడీకి షాకివ్వాలని కోరుకుంటున్నారు. మరి కాంగ్రెస్ అభిమానుల కల నెరవేరుతుందా.. లేక అది రీల్ కే పరిమితమవుతుందా.. చూడాలి.