వంగ‌వీటి రివ్యూ

Posted December 23, 2016

vangaveeti review 

రివ్యూ: వంగవీటి

బ్యానర్‌: రామదూత క్రియేషన్స్‌

తారాగణం: శాండీ, వంశీ చాగంటి, శ్రీతేజ్‌, నైనా గంగూలి, కౌటిల్య, వంశీ నెక్కంటి తదితరులు

సంగీతం: రవిశంకర్‌

ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాస్తవ్‌, దిలీప్‌ వర్మ, సూర్య చౌదరి

నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌

దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ

విడుదల తేదీ: డిసెంబరు 23, 2016

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, క్రియేటివ్ జీనియ‌స్  రామ్ గోపాల్ వ‌ర్మ ఎన్ని  వివాదాల్లో త‌ల‌దూర్చినా, వివాస్పద వ్యాఖ్య‌ల‌తో ఎంద‌రి నోళ్ల‌ల్లో నానుతున్నా, ఎన్ని ప్లాప్స్ తీసినా ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న సినిమాల‌కి క్రేజ్ ఏర్ప‌డిపోతుండ‌డం క్వైట్ కామ‌న్. ముందునుంచి ఆయ‌న‌కు మాఫియా అన్నా ముఠా క‌క్ష‌ల నేప‌ధ్యం అన్నా  చాలా ఆస‌క్తి. ఎన్నో సినిమాల్లో త‌న ఆస‌క్తికి దృశ్యం రూపం ఇచ్చుకున్నాడు. కొన్ని సినిమాలు అద్భుతాలు సృష్టిస్తే మ‌రికొన్ని సినిమాలు ప్లాప్స్ గా మిగిలిపోయాయి. ఇప్పుడు వ‌ర్మ మ‌రో సినిమాతో సంచ‌ల‌నాలకు తెరతీసాడు. సినిమా పేరు వంగ‌వీటి . బెజ‌వాడ బెబ్బులి గా పేరు పొందిన వంగ‌వీటి మోహ‌న రంగా హత్యోదంతాన్ని  వంగ‌వీటి సినిమాకి ఇతివృత్తంగా తీసుకున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్స్  తో రిలీజ్ కు ముందే సంచ‌నాలు సృష్టించాడు. త‌న ట్రేడ్ మార్కుల షాట్స్ తో జ‌నంలో ఆస‌క్తిని క్రియేట్ చేసాడు. కాపు కాసే శ‌క్తి అనే ట్యాగ్ లైన్ తో ఇప్ప‌టికే ఆస‌క్తిని రేకెత్తించాడు. మ‌రి సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకుందా..? ఆ విశేషాలేంటో చూద్దాం ప‌దండి.

కథ:

విజయవాడలో చిన్న రౌడీగా ప్రస్థానం ఆరంభించి.. కమ్యూనిస్టు నేత వెంకటరత్నం అండతో నగరాన్నే శాసించే స్థాయికి ఎదుగుతాడు రాధా (సందీప్ కుమార్). రాధా ఎదుగుదల వెంకటరత్నానికి కంటగింపు అవుతుంది. అతణ్ని అవమానిస్తాడు. దీంతో రాధా.. వెంకటరత్నాన్ని మట్టుబెట్టి విజయవాడను తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు. ఆపై రాధాకు.. అన్నదమ్ములైన గాంధీ (కౌటిల్య).. నెహ్రూ (శ్రీతేజ్) దగ్గరవుతారు. ఇంతలో తమ నేతను మట్టుబెట్టాడన్న కోపంతో వెంకటరత్నం పార్టీ మనుషులు రాధాను చంపేస్తారు. దీంతో రాధా తమ్ముడైన రంగా అతడి స్థానంలోకి వస్తాడు. అక్కడి నుంచి పరిస్థితులు ఎలా మలుపు తిరిగాయి.. రంగా ప్రస్థానం ఎలా సాగింది.. ఎలా ముగిసింది అన్నది మిగతా కథ.

క‌ధనం విశ్లేష‌ణం :

రామ్ గోపాల్ వ‌ర్మ ముఠా త‌గాదాల్ని , మాఫియా ప‌నితీరుని చాలా లోతుగా  వెళ్లి క‌ళ్ళకు క‌ట్ట‌డంలో చాలా దిట్ట‌. వంగ‌వీటిలో వాటిని మ‌రీ డీటైల్డ్ గా చూపించాడు. సినిమా మొత్తం హ‌త్య‌ల్ని స్కెచ్ వేయ‌డం వాటిని అమ‌ల్లో పెట్ట‌డంతోనే చాలా సినిమాను లాగేసాడు. మ‌ర్డ‌ర్ సీన్స్ ను ఒక ఆర్డ‌ర్ లో పెట్టుకుంటూ వెళ్లిపోయాడ‌నిపిస్తుంది. క‌థ‌ను గాల్లో వ‌దిలేసి  , అస‌లు జ‌రిగిన క‌థ‌ను , అది జ‌రిగిన పరిణామాల్ని చూపించ‌కుండా సినిమాను ఎటో తీసుకెళ్లిపోయాడు. టోట‌ల్ గా ఈ సినిమాను  రామ్ గోపాల్ వ‌ర్మ త‌న టేకింగ్ ప‌నిత‌నాన్ని మ‌రో సారి చాటి చెప్ప‌డానికే తీసాడ‌నిపిస్తుంది త‌ప్పితే వంగ‌వీటి మోహ‌న రంగా ఒరిజిన‌ల్ జీవితంలో జ‌రిగిన నిజ‌మైన అంశాల్ని తీయడంలో త‌డ‌బ‌డ్డాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

నటీ న‌టుల పెర్ఫార్మెన్స్ :

రంగా గా, రాధాగా రెండుపాత్ర‌ల్ని స‌మ‌ర్ధ‌వంతంగా పోషించాడు సాండీ అనే సందీప్ కుమార్.  అయితే రాధా పాత్ర‌లో చూపించిన వేరియేష‌న్స్ ను , లుక్స్ ను రంగా పాత్ర‌లో ప‌లికించ‌లేపోయాడు.  రంగా పాత్ర‌ను కూడా పై పైనే లాగించేసార‌నిపిస్తుంది.  ఇక ర‌త్న‌కుమారి పాత్ర‌లో న‌టించిన నైనా గంగూలి ప‌ర్వాలేద‌నిపిస్తుంది. దేవినేని ముర‌ళి గా న‌టించిన వంశీ ఈ సినిమాతో త‌న టాలెంట్ ను మ‌రోసారి చాటుకున్నాడు. నెహ్రూగా న‌టించిన శ్రీతేజ్ కూడా బాగానే చేసాడు.

ప్లస్ పాయింట్స్ :

వ‌ర్మ టేకింగ్

హీరో పెర్ఫార్మెన్స్

సినిమా టోగ్ర‌పీ

సంగీతం

మైనస్ పాయింట్స్ :

క‌థ‌, క‌థ‌నాలు

రక్త‌పాతం

జ‌రిగిన క‌థ‌లో లేని అంశాలు

సాంకేతికవర్గం:

వర్మ సినిమా అంటే.. సాంకేతిక నిపుణులంతా ఆయన స్టయిల్లో పని చేయాల్సిందే. ‘వంగవీటి’ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. సినిమాకు ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పని చేసినా.. యూనిఫార్మిటీ కనిపిస్తుంది. దాన్ని బట్టే అందరూ వర్మ శైలిలో పని చేశారని అర్థమవుతుంది. వర్మ మార్కు కెమెరా యాంగిల్స్.. ఏరియల్ షాట్స్ ఆకట్టుకుంటాయి. ఛాయాగ్రహణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. రవిశంకర్ మ్యూజిక్ ఓకే. గత సినిమాలతో పోలిస్తే నేపథ్య సంగీతంలో లౌడ్ నెస్ కొంచెం తగ్గించాడు. ‘మరణం’ సాంగ్ బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్లుగా ఉంది. మాటలు కూడా సన్నివేశాలకు తగ్గట్లుగా సంక్షిప్తంగా ఉన్నాయి.

తెలుగు బుల్లెట్ అనాల్సిస్ :

 సినిమాను నిలబెట్టే బలమైన పాత్ర లేకపోవడం ‘వంగవీటి’ బలహీనత.  సినిమాలో రాధా పాత్ర కాసేపే ఉన్నా బాగా ఎలివేట్ అయింది కానీ.. రంగా పాత్రకు స్క్రీన్ టైం ఎక్కువున్నప్పటికీ ఆ పాత్ర అనుకున్నంతగా పండలేదు. రంగా పాత్రను సరిగా బిల్డ్ చేయకపోవడం.. అతడి ఎదుగుదలను సరిగా చూపించకపోవడమే దీనికి కారణం కావచ్చు. ఓవరాల్ గా ‘వంగవీటి’ వర్మ తీసిన గత కొన్ని సినిమాల కంటే మెరుగనిపిస్తుంది తప్ప ఆయన తీసిన మ‌రో గొప్ప సినిమా అయితే ఏమీ కాదు.

బాట‌మ్ లైన్ : ర‌క్త‌వీటి

రేటింగ్ :2.5/5