వంగవీటి కథతో ఇంకో సినిమా .. డైరెక్టర్ గా విలన్

Posted December 27, 2016


వంగవీటి ప్రకంపనలు ఆగకముందే ఆ వివాదాస్పద కథతో మరో సినిమా అనౌన్స్ అయ్యింది .నేను తీసింది తప్పయితే మరో సినిమా తీసి ఇదే అసలు వంగవీటి అని చెప్పుకోండి అంటూ వర్మ విసిరిన సవాల్ కి విలన్ కం డైరక్టర్ జీవి స్పందించాడు .వంగవీటి గొప్పదనాన్ని చాటే సినిమా తీసి వచ్చే ఏడాది ఇదే సమయానికి సినిమా విడుదల చేస్తానని ప్రకటించాడు .ఎన్నో సినిమాల్లో విలన్ వేషాలు వేసిన జీవి గతంలో శ్రీకాంత్ హీరోగా రంగ ది దొంగ ,నితిన్ హీరోగా హీరో అనే చిత్రాలకి దర్శకత్వం వహించారు .

ఒకానొక టైం లో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న జీవి ఇటీవల కాపు ఉద్యమంలో చురుగ్గా వున్నారు .ముద్రగడకి మద్దతుగా సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ అయన ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు . ఈ టైం లో వర్మ సవాల్ కి జీవి స్పందించడం లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు .అయితే రెండు ప్లాప్ లు ఇచ్చిన జీవితో సినిమా తీయడానికి ఏ నిర్మాత ఆసక్తి చూపిస్తాడో తెలియాల్సి వుంది.