సొంత కూతురును కిడ్నాప్‌ చేసిన మాజీ హీరోయిన్‌

0
117

Posted May 20, 2017 at 18:48

vanitha kidnap her own daughter
తెలుగు ప్రేక్షకులకు మాణిక్యం, చంద్రలేఖ ఇంకా పలు డబ్బింగ్‌ చిత్రాలతో సుపరిచితురాలైన మాజీ హీరోయిన్‌ వనిత తన సొంత కూతురును కిడ్నాప్‌ చేసింది. అయితే ఈ విషయాన్ని ఆమె ఒప్పుకోవడం లేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే వనిత ఇప్పటి వరకు మూడు పెళ్లిల్లు చేసుకుంది. మొదటి భర్తతో వనితకు పిల్లలు లేరు, రెండవ భర్తతో జయనిత అనే 8 సంవత్సరాల పాప ఉంది. కొన్నాళ్ల క్రితం రెండవ భర్త అయిన ఆనంద్‌ రాజ్‌ నుండి వనిత విడిపోయింది. దాంతో పాప జయనితను భర్త ఆనంద్‌ రాజ్‌ వద్ద వదిలేసింది. ఆ తర్వాత మూడవ పెళ్లి చేసుకున్న వనిత గత సంవత్సరం అతడి నుండి కూడా విడిపోయింది. ఈ సమయంలో ఒంటరి తనం భరించలేక తన కూతురు జయనితను తన వద్దకు తెచ్చుకునేందుకు కిడ్నాప్‌కు ప్లాన్‌ చేసింది.

జయనితను తనకు అప్పగించాల్సిందిగా హైదరాబాద్‌ పోలీసుల ద్వారా ఆనంద్‌ రాజ్‌ను ఆమె అభ్యర్థించింది. అయితే అందుకు ఆయన ఒప్పుకోలేదు. దాంతో తన కూతురు తనను కోరుకుంటుంది, తన వద్దే ఆమె ఉండాలని ఆశిస్తుందంటూ హైదరాబాద్‌ నుండి రాత్రికి రాత్రే జయనితను వనిత కిడ్నాప్‌ చేసుకుని తీసుకు వెళ్లింది. అయితే ఆనంద్‌ రాజ్‌ మాత్రం జయనితకు ఇష్టం లేకుండానే వనిత తీసుకు వెళ్లిందని ఆరోపిస్తున్నాడు. జయనితకు ఇష్టం అయ్యి వెళ్తే తనకు ఏం అభ్యంతరం లేదని, తన కూతురును బలవంతంగా ఎత్తుకు వెళ్లింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు వనితను ఎంక్వౌరీ చేసేందుకు చెన్నై వెళ్లారు. చెన్నైలో ఆమె లేదు, కాని ఆమె ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాదానం ఇచ్చింది. తన కూతురు తనతో ఉండాలని కోరుకుంది కనుకే తీసుకు వచ్చాను అని, ఇది కిడ్నాప్‌ ఎలా అవుతుందని ఆమె అంటుంది. పోలీసులు జయనితతో మాట్లాడివ్వాలని వనితను కోరారు. అయితే అందుకు ఆమె నిరాకరించింది.