వర్మ ఆహ్వానం పవన్ కు అందిందా..?

Posted December 20, 2016

Varma Send Invitation To His Function

వంగవీటి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వర్మ సిని ప్రస్థానం గురించి ఈరోజు ఓ స్పెషల్ ఈవెంట్ జరుగబోతుంది. తనతో పనిచేసిన టెక్నిషియన్స్ తో పాటుగా తన దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్న తన శిష్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ముందు అబిగ్ బి అంతాబ్ లాంటి స్టార్స్ ను ఈ ప్రోగ్రాంకు ఇన్వైట్ చేశారట మరి ఏమైందో ఏమో కాని నాగార్జున మాత్రమే వస్తున్నాడని తెలిసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా ఈ ప్రోగ్రాం ఇన్విటేషన్ అందిందని సమాచారం.

ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ కోసం అవుట్ ఆఫ్ వెళ్లిన పవన్ ఈ ఈవెంట్ కు అటెండ్ కాలేకపోతున్నాడట. పవన్ బదులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతాడట. రాజమౌళి కూడా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. సంచలన దర్శకుడు వర్మ ప్రత్యేకమైన తన శైలిలో సినిమా తీస్తూ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తాడు. పవన్ రాకపోడానికి కేవలం సమయం అడ్జెస్ట్ కాకనేనా లేక ఈ మధ్య వర్మ మెగా హీరోలను టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి ఆ కోపంతోనా అన్నది తెలియాల్సి ఉంది.