ట్రెండ్ మార్చిన వర్మ..!!

Posted February 9, 2017

varma the trend setterనేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తాను అని పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా శివ సినిమాతో టాలీవుడ్ రూపురేఖలను మార్చిన వర్మని నిజంగానే ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. ట్రెండ్ తో సంబంధం లేకుండా తనకు తోచినట్లు, నచ్చినట్లు సినిమాలు తీసుకుంటూ పోతుంటాడు. వాటిల్లో కొన్ని పరాజయం పొందినా కొన్ని సినిమాలు మాత్రం నిజంగా ట్రెండ్ ని సెట్ చేశాయి. అయితే తనకు సంబంధంలేని విషయాల్లో కూడా కలగచేసుకుంటూ చిత్రవిచిత్రంగా మాట్లాడూతూ వివాదాస్పదంగా కూడా మారాడు ఈ దర్శకుడు.

కాగా ఇప్పటివరకు తన సినిమాల రీలజ్ ల విషయంలో అంత స్పెషల్ డేట్స్ ని సెలెక్ట్ చేసుకోని వర్మ ట్రెండ్ ని మార్చేశాడు. తన తాజా చిత్రాన్ని  తన పుట్టినరోజు నాడు విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాడట. బాలీవుడ్ మెగా  స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన సర్కార్ -3 ని తన పుట్టినరోజు అంటే ఏప్రిల్-7న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వర్మ ప్రకటించాడు. ఈ సందర్భంగా అమితాబ్‌కు చెందిన ఓ ఫొటోను కూడా విడుదల చేశాడు. సర్కార్ సినిమాతో బాలీవుడ్ లో ఉన్నత స్థానాన్ని ఆక్రమించిన వర్మ మరి ఈ సర్కార్-3 తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడేమో చూడాలి.