వెలగపూడికి ఇంకో రెండు శాఖలు..

velagapudi

వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మరో రెండు శాఖలు ప్రారంభమయ్యాయి. ఉన్నత విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖలు నేడు ఉదయం మొదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నత విద్యా శాఖ ఆఫీసును ప్రారంభించి, తన చాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి కార్యాలయ గృహ ప్రవేశాన్ని పూర్తి చేశారు. రెండో బ్లాక్ లోని మొదటి అంతస్థులో గంటా సూచనల మేరకు విద్యా శాఖ కార్యాలయానికి మార్పు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పీతల సుజాత మూడో భవనంలోని మొదటి అంతస్థులో కార్యాలయాన్ని ప్రారంభించి తన చాంబర్ లోకి ప్రవేశించారు.

sujatha