మరో రీమేక్ పై మోజుపడ్డ వెంకీ

Posted February 4, 2017

venkatesh again remake malayalam movieకింగ్ నాగార్జున, మెగా స్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్.. ఇలా హీరోల ముందు ఉన్నపేర్లనీ వాళ్ల హీరోయిజానికి వచ్చిన బిరుదులు. అయితే విక్టరీ వెంకటేష్ మాత్రం రీమేక్ వెంకటేష్ గా మారుతున్నాడని సినీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారి అభిప్రాయానికి తగ్గేట్టే వెంకటేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా రీమేక్ సినిమాలపైనే పడ్డాడు. వాటితో హిట్స్ కూడా కొడుతున్నాడు. గోపాల గోపాల, దృశ్యం వంటి సినిమాలు  అలా రీమేక్ చేసి హిట్ కొట్టినవే.

తాజాగా సాలా ఖదూస్ అనే హిందీ సినిమాను గురు పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ గురు సినిమాలో వెంకీ బాక్సింగ్‌ కోచ్‌గా చాలా దృఢంగా కనిపించనున్నాడు. కాగా ఈ గురు సినిమా తర్వాత వెంకీ మరో రీమేక్ సినిమాలో నటించనున్నాడని తాజా సమాచారం.

నిజానికి  గురు సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లూ మీకు జోహార్లు అనే సినిమా చేయాల్సి ఉన్నా స్టోరీ నచ్చకపోవడంతో ఈ సినిమాను పక్కన పెట్టి మళ్లీ రీమేక్ కే మొగ్గు చూపుతున్నాడట వెంకీ. మలయాళంలో మోహన్ లాల్ – మీనా జంటగా తెరకెక్కిన ‘ముంతిరి వల్లికల్ తలిర్ క్కుంబల్’ మంచి విజయాన్ని  అందుకుంది. దీంతో ఈ సినిమాను గురు తర్వాత వెంటనే  తెలుగులో  రీమేక్ చేయడానికి వెంకటేశ్ ఆసక్తిని చూపిస్తున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  గతంలో వెంకీ చేసిన ‘దృశ్యం’ మలయాళ మాతృకలోనూ మోహన్‌లాల్-మీనానే  జోడీగా నటించారు. మరి వెంకీ మళ్లీ అదే కాంబినేషన్ లో ఈ కొత్త చిత్రాన్ని చేయనున్నాడా లేక ఈ సారి వెరైటీగా ట్రై చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా రీమేక్ లతో కాకుండా ఏదైనా స్ట్రైట్ సినిమా చేసి హిట్ కొడితే బాగుంటుందేమో వెంకీ ఒకసారి ఆలోచించడం బెటర్.