“గురు” కోసం సమ్మర్ దాకా ఆగాల్సిందే

Posted February 11, 2017

venkatesh guru movie release postponedగతేడాది బాబు బంగారంతో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలని పోషించాడు. అయితే ఇప్పటివరకు చెయ్యని ఓ డిఫరెంట్ రోల్లో గురు సినిమాలో నటించాడు వెంకీ. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  వెంకీ బాక్సింగ్ కోచ్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. అలాగే రితిక సింగ్, ముంతాజ్ సర్కార్ లు ఈ చిత్రంలో  ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. రితిక సింగ్ ఇటీవలే ఉత్తమ నటి క్యాటగిరిలో నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఇక ముంతాజ్  సర్కార్ విషయానికొస్తే ఆమె గ్రేట్ మెజీషియన్ పి. సి. సర్కార్ కుమార్తె కావడం విశేషం.

కాగా ఈ సినిమా ఆడియో  మార్చి మొదటివారంలో విడుదలకానుండగా,  సినిమా విడుదలకు మాత్రం సమ్మర్ వరకు ఎదురుచూడాల్సిందే. నిజనికి ఈ లోపలే సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తైనా ఏప్రిల్ 28న బాహుబలి విడుదల కానుంది. దీంతో ఈ సినిమాను మే లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు సమ్మర్ హాలీడేస్ అన్నీ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తే సినిమా ఎవరు చూస్తారని సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరి గురు ఏం చేస్తాడో చూడాలి.