హోదాపై మళ్ళీ ఆశలు రేపిన వెంకయ్య ..

VENKAIAH_NAIDU

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే విషయమై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పూర్తిగా దృష్టి పెట్టారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. నీతి ఆయోగ్ ఛైర్మన్ తో కలిసి ఆయన దీనిపై వర్క్ చేస్తున్నారని, త్వరలోనే ఈ కసరత్తు ఓ కొలిక్కి వచ్చి ఇష్యూపై స్పష్టత వస్తుందని  అన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఎ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రాహుల్ గాంధి మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడం పట్ల వెంకయ్య నాయుడు మండిపడ్డారు.

రాజ్యసభలో ఇచ్చిన హామీ ఎందుకు అమలు పరచలేదని మన్మోహన్ ప్రశ్నించారని, మరి అధికారం లో ఉన్నపుడు కాంగ్రెస్ ఏం చేసిందని కాంగ్రెస్ ను ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు ఏపీ విభజించి ఎందుకు ప్రత్యేక హోదా కల్పించలేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. “హామీ ఇచ్చిన వారు అధికారం లో ఉన్నపుడు అమలు చేయొచ్చు కదా…2004 లో తెలంగాణా ఇస్తామని హామీ ఇచ్చి 2014 వరకు పట్టించుకోలేదు..

ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనం ఆశించి బిల్లు తెచ్చింది కాంగ్రెస్ ..విభజన సమయంలో ఆంధ్ర కు న్యాయం గురించి కాంగ్రెస్ పట్టించుకోలేదు ..ఇప్పుడు హామీ ఇచ్చాం ఆ హామీ ఏమైందని మమ్మల్ని అడుగుతున్నారు…రాష్ట్ర విభజన సమయంలో మేం ఏం చెప్పామో మాకు గుర్తుంది…ఆర్దిక మంత్రి విభజన హామీలపై సభలో స్పష్టత ఇచ్చారు.. అవి నెరవేరుస్తాం” అని వివరించారు.