ఈసీ కి విజయ సాయి విజ్ఞప్తి…

 Posted November 2, 2016

vijaya sai reddy meet and request bhanwar lalవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను మరో నెలరోజుల పాటు పొడిగించాలని ఆయన ఈ సందర్భంగా భన్వర్లాల్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయ సాయిరెడ్డి ఓ వినతి పత్రం సమర్పించారు.అనంతరం విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారిలో ఇప్పటివరకూ 50శాతం మంది కూడా ఓటర్లుగా నమోదు చేయించుకోలేదన‍్నారు. ఈసీ వెంటనే జోక్యం చేసుకుని గడువు పొడిగించాలని ఆయన కోరారు. కాగా ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీల ఓట్ల నమోదు ప్రక్రియ రాష్ట్రంలో నత్తనడకన సాగుతున్న విషయం తెలిసిందే.