నో ఎంగేజ్ మెంట్ …ఓన్లీ ఎంజాయ్ మెంట్

Posted December 30, 2016

virat kohli clarify about engagement
విరాట్ ,అనుష్క నిశ్చితార్ధం జరగబోతుందని సోషల్ మీడియా లో వచ్చిన వార్తలు వట్టి పుకార్లేనని తేలింది. జనవరి 1 న ఉత్తరాఖండ్ లోని ఓ రిసార్ట్ లో వీరి ఎంగేజ్ మెంట్ కి ఏర్పాట్లు సాగిపోతున్నట్టు జాతీయ మీడియా కూడా రిపోర్ట్ చేసింది.ఆ వేడుకలో పాల్గొడానికే బిగ్ బి అమితాబ్, అంబానీ కుటుంబాలు కూడా ఉత్తరాఖండ్ వచ్చినట్టు తెలిపాయి.అయితే ఈ వార్తలన్నీ వట్టి పుకార్లే అని తేలిపోయింది.

ఎంగేజ్మెంట్ వార్తలపై విరాట్,అనుష్క విడివిడిగా ఈ అంశంపై స్పందించారు.ఇప్పుడు తాము ఎంగేజ్ మెంట్ ఆలోచనల్లో లేమని ,..అలాంటిది ఏదైనా ఉంటే అందరికీ చెప్పి చేసుకుంటామని విరాట్ స్పష్టం చేశారు.దీంతో ఈ జంట ఉత్తరాఖండ్ పర్యటన కేవలం కొత్త ఏడాది వేడుకల్ని ఎంజాయ్ చేయడానికేనని తేలిపోయింది.అలాగే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసమే అమితాబ్, అంబానీ ఫామిలీ లు కూడా డెహ్రాడూన్ వచ్చినట్టు సమాచారం.