నేను ఆ పని చేయలేదు.. కోహ్లి

Posted November 25, 2016

Virat Kohli responds to ball tamperingతాను నిజంగా బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడి ఉంటే ఐసీసీ అప్పటికప్పుడే నిలదీసి ప్రశ్నించేదని భారత టెస్ట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. తనపై బ్రిటిష్‌ పత్రిక చేస్తున్న బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలను విరాట్‌ ఖండిస్తూ సిరీస్‌ నుంచి తన ఫోకస్‌ మళ్లించడానికే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించాడు. ‘పత్రికలో నాపై వచ్చిన వార్తలను నేను పట్టించుకోను. నేను నిజంగా తప్పు చేసి ఉంటే ఐసీసీ నాతో మాట్లాడేది. ఓ క్రికెటర్‌గా నాకు ఐసీసీ నిర్ణయంపైనే గౌరవం. ఇక నాపై పత్రికల్లో వస్తున్న ఆరోపణలంటారా.. నేను పత్రికలు ఎక్కువగా చదవను, అందులో నాపై వచ్చే ఆరోపణలను పట్టించుకోను. ఒకవేళ ఎవరైనా చదివి నాకు చెబితే నవ్వి వూరుకుంటాను. నన్ను సిరీస్‌ నుంచి దృష్టి మళ్లించడానికి ఈ ఆరోపణలు చేస్తున్నవారికి బెస్ట్‌ ఆఫ్‌ లక్‌. మేము ఏంచేయాలో వాటిపైనే దృష్టిపెడతాం’ అని కోహ్లీ అన్నాడు.