వై.ఎస్ కొడుకు కన్నా ఆత్మే ఎక్కువన్న శిష్యుడు …

Posted December 15, 2016

vishnu selfrespect more than teacher
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ లో కాంగ్రెస్ కి భవిష్యత్తే కనిపించడం లేదు. అందుకే దింపుడు కళ్లెం ఆశలు వదిలేసుకున్న కాంగ్రెస్ నేతలు ఏదో ఓ గూడు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల మీద కన్నేసిన వైసీపీ కూడా వారికి సాదర స్వాగతం పలుకుతోంది.వాళ్ళంతట వాళ్ళు రాకపోయినా తామే చొరవ తీసుకుని ఆహ్వానిస్తున్న సందర్భాలు కూడా వున్నాయి.అలా వైసీపీ నుంచి ఆహ్వానం అందుకున్న ఓ కాంగ్రెస్ నేత జగన్ పిలుపుకి సున్నితంగా నో చెప్పినట్టు తెలుస్తోంది.అయన ఒకప్పుడు వై.ఎస్ కి ప్రియ శిష్యుడు కూడా .ఇప్పుడు వై .ఎస్ ఆత్మ కేవీపీ కి తల్లోనాలుకలా మెలిగే మల్లాది విష్ణు.

బీజేపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ లో చేరాక విజయవాడ మీద జగన్ ప్రత్యేక దృష్టి సారించాడు.అందులో భాగంగానే విష్ణుని కదిలించారు వైసీపీ ముఖ్య నేతలు ..జగన్ మాటగా చెప్తున్నామంటూ భవిష్యత్ కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.అయితే అంతా విన్న విష్ణు తాను కాంగ్రెస్ ని వదిలే ఆలోచన లేదని చెప్పారంట.పైగా కేవీపీ ఎక్కడుంటే తానూ అక్కడేనని కుండ బద్దలు కొట్టారంట.అంటే వై.ఎస్ కొడుకు కన్నా అయన ఆత్మ లాంటి కేవీపీ మీదే నమ్మకం వుంచారన్న మాట మల్లాది విష్ణు .