వైఫైతో వీఆర్‌ హెడ్‌సెట్‌…

Posted November 11, 2016
vr headset with wifi connectionఇప్పటివరకు చాలా వీఆర్‌ హెడ్‌సెట్‌ల గురించి వినుంటాం.. లేదా కొద్ది మంది వాడుంటారు.. అవి వాడాలంటే మనకో మొబైల్‌ తప్పని సరి.. దానితోపాటు మొబైల్‌ కనెక్టవిటీనే ముఖ్యం కాని కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన బింగో జీ-200తో ఆ ఇబ్బందులుండవు.. సొంతంగా హెడ్‌డీ స్ర్కీన్‌ ఉండటం దీని ప్రత్యేకత.. దానితోపాటు వైఫై కూడా ఎనేబుల్డ్‌.. ఇంకేముంది ఎంచక్కా ఏ వీడియోలు కావాలన్నా నేరుగా స్టీమింగ్‌ చేసకునే చూడొచ్చు.. 110 డిగ్రీల వైడ్‌యాంగిల్‌లో దీన్ని చూడొచ్చు.. 1జీబీ ర్యామ్‌, 8జీబీ అంతర్గత మెమరీ కూడా ఉంది.. బ్యాటరీ సైతం 5000 ఎంఏహెచ్‌తో భారీగానే ఇస్తున్నారు.. దాని సాయంతో దాదాపు 6 గంటల పాటు ఏకదాటిగా వీడియోలు చూడొచ్చు.. మెమరీ కార్డు 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.. మరి ఇన్ని ఫీచర్లున్నాయి కదా.. ధర భారీగా ఉంటుందేమో కంగారు వద్దు.. రూ.5,999 ధరతో సామాన్యులకు అందుబాటులోనే ఉంది..