కలెక్టరమ్మకు 500 ‘బాహబలి 2’ టికెట్లు

0
160

Posted April 26, 2017 at 13:00

warangal collector amrapali booked 500 bahubali 2 movie tickets
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మరియు ఇతర దేశాల్లో కూడా ‘బాహుబలి 2’ ఫీవర్‌ ఓ రేంజ్‌లో ఉంది. గత సంవత్సర కాలంగా ‘బాహుబలి 2’ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ముందుకు మరి కొన్ని గంటల్లో రాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. సినిమా విడుదల కాబోతున్న అన్ని థియేటర్లలో కూడా అడ్వాన్స్‌ బుకింగ్‌ పూర్తి అయ్యింది. దొరకని వారు కొందరు ఎమ్మెల్యే, ఎంపీ లెవల్‌లో పైరవీలు సాగిస్తూ టికెట్లను పొందుతున్నారు. ఈ సినిమా రేంజ్‌ ఏ స్థాయిలో ఉందో మరో సంఘటన ద్వారా వెళ్లడైంది.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రాపాలి గారికి కూడా ‘బాహుబలి 2’ సినిమా చూడాలనే కోరిక చాలా కాలంగా ఉన్నట్లుంది. మొదటి రోజు మొదటి ఆట చూడాలనే ఉద్దేశ్యంతో కలెక్టర్‌ గారు హన్మకొండ శ్రీదేవి థియేటర్‌లో ఏకంగా 500 టికెట్లను బుక్‌ చేయించుకున్నారు. దేశంలోని అతి చిన్న వయస్సు కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆమ్రాపాలి ‘బాహుబలి 2’కు అత్యధికంగా టికెట్లను బుక్‌ చేసుకుని మరోసారి వార్తల్లోకి ఎక్కారు. స్నేహితులు, బందువులు, కుటుంబ సభ్యులు, తనతో జాబ్‌ చేసే అధికారుల ఫ్యామిలీ మెంబర్స్‌ అందరికి కలిపి ఏకంగా అయిదు వందల టికెట్లను ఆమె బుక్‌ చేశారని తెలుస్తోంది. ఆమ్రాపాలి మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ప్రముఖులు కూడా ‘బాహుబలి 2’ మొదటి రోజు టికెట్లు బుక్‌ చేసుకున్నారు.