తెలంగాణ పై వర్ద ఎఫెక్ట్ ..

Posted December 13, 2016

wardha cyclone effect on telanganaఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలను ఒక ఊపు ఊపిన వార్థ తుపాను కన్ను ఇప్పుడు తెలంగాణ మీద పడింది ..ఈ ప్రభావం కారణం గా తెలంగాణ లో కూడా చెదురు మదురు గా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ సఖ అంటోంది .ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని. రాత్రిపూట ఉష్ణోగ్రతలు అంతకంతకూపడిపోతాయని ,ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, మెదక్ లలో 13 డిగ్రీలు, హన్మకొండ, ఖమ్మంలలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, హైదరాబాద్ లో మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, 31 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి…బైటకి వెళ్ళేటప్పుడు,పిల్లలు వృద్దులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.