తీవ్ర తుపాను గా మారిన వార్ధా…

Posted December 10, 2016

wardha cyclone effect to andhra pradeshబంగాళాఖాతంలో ఉన్న వార్దా తుఫాను.. తీవ్ర పెనుతుఫానుగా మారింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక్కసారిగా దిశ మార్చుకుంది. శుక్రవారం ఉదయం వరకూ ఉత్తరంగా పయనించిన తుఫాను, తరువాత పశ్చిమ వాయవ్య దిశకు తిరిగి నెమ్మదిగా కదులుతోంది.డిసెంబర్ 11వ తేదీ వరకూ అదే తీవ్రతతో పయనించనున్నది. ఆ తరువాత కోస్తాకు సమీపంగా వచ్చే సమయంలో తిరిగి తుఫాను వాయుగుండంగా బలహీనపడనున్నది. సోమవారం సాయంత్రం మచిలీపట్నం, నెల్లూరు మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇస్రో అంచనా ప్రకారం కావలి – నెల్లూరు మధ్య తీరం దాటుతుంది .ఆదివారం నుంచి రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో విస్తారంగా, తూర్పుగోదావరి నుంచి నెల్లూరు వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.