“వార్థ” అప్ డేట్ ..

Posted December 12, 2016

wardha cyclone effect start in andhra pradeshతీరం దాటనున్న తరుణం లో వార్థ తుపాన్ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్  లో మొదలైంది దక్షిణ కోస్తా తీరం వెంబడి ప్రాంతం పై  ప్రభావం చూపిస్తోంది .నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో భారీ వర్షం కురిసింది. వార్దా తుపాను తీరానికి దగ్గరవుతున్నకొద్దీ గాలి వేగంతో పాటు, వర్ష తీవ్రత కూడా పెరుగుతోంది.ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప తుపానుపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు

wardha cyclone live updates in chennai

‘వర్ద’ తుపాను చెన్నై సమీపంలో సోమవారం మధ్యాహ్నం తీరం దాటనున్నట్టు భావిస్తున్న నేపథ్యంలో చెన్నై సహా పలు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తలపై పలు విభాగాల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాల్లో సహాయక బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉంచారు .సోమవారం ఉదయానికి చెన్నైకి తూర్పుగా 140 కి.మీ, నెల్లూరు తూర్పు ఆగ్నేయంగా 250 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 11 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి దిశగా కదులుతోంది.తమిళనాడు, ఆంధ్రపప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం చెప్తోంది .