మేము కూడా సిద్ధమే..!

Posted November 15, 2016

We Are Also Ready To Do Comedy Showగాలి జనార్ధన్ రెడ్డి ఇంట పెళ్లి టాలీవుడ్ లో సందడి మొదలైంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికి ఈ మ్యారేజ్ ఇన్విటేషన్ అందుతుందట. అయితే కేవలం రావడమే కాదు అక్కడ ప్రోగ్రాంస్ కూడా కండక్ట్ చేసేలా కొందరికి అడిగిన మొత్తం ఇచ్చేస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే రకుల్, ప్రియమణిలతో డ్యాన్స్ ప్రోగ్రాం చేయిస్తున్నారని టాక్. ఇక బ్రహ్మితో కూడా స్పెషల్ షో ఉంటుందట. అందుకు గాను పెద్ద మొత్తాన్నే ఇస్తున్నారట.

అయితే ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తుంది జబర్దస్త్ టీం. తాము కూడా ఇప్పుడు సెలబ్రిటీస్ అయ్యామని.. మేము కూడా గాలి ఇంట కామెడీ పండించేందుకు సిద్ధమే అని ఫిల్లర్లు వదులుతున్నారు ఈ కామెడీ ఆర్టిస్టులు. జబర్దస్త్ పుణ్యమాని ఆ షోలో చేస్తున్న వారందరు మంచి క్రేజ్ సంపాదించారు. అయితే ఇప్పుడు అదే క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో స్పెషల్ ఈవెంట్స్ చేస్తున్నారు. గాలి ఇంట టాలీవుడ్ అంతా కనబడుతున్న ఈ సందర్భంలో అక్కడ తమ షోతో సెన్షేషన్ క్రియేట్ చేయాలని అక్కడ ప్రోగ్రాం కోసం ప్లానింగ్ లో ఉన్నారట జబర్దస్త్ టీం. మరి వీరు అనుకున్నట్టు అక్కడ వీరికి అవకాశం దొరుకుతుందో లేదో చూడాలి.