వెబ్సైట్ హద్దు మీరితే యాడ్స్ నిల్..గూగుల్ సీఈఓ

Posted December 1, 2016

Image result for sundar pichai

చేతిలో కంప్యూటర్,లాప్టాప్, చేతి కింద పనివాళ్ళు వెబ్ సైట్ వుంది కదా అని తెగ గాసిప్స్ ని పబ్లిష్ చేస్తే గూగుల్ నుంచి వచ్చే యాడ్స్ ఇకపై రావని గూగుల్ సి ఈ ఓ సుందర్ పిచాయ్ వెబ్ సైట్ నిర్వహకులకి డెడ్ లి వార్నింగ్ ఇచ్చారు.ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సోషల్ మీడియా ప్ర‌భావం పెర‌గ‌డంతో వెబ్‌సైట్లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. సోష‌ల్ మీడియాను వాడుకుంటూ త‌మ సైట్ల‌ను ప్ర‌మోట్ చేసుకుంటూ గూగుల్ యాడ్స్ ద్వారా వెబ్‌సైట్లు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. దీంతో అన్ని భాష‌ల్లోను విప‌రీతంగా వెబ్‌సైట్లు పుట్ట‌గొడుగుల్లా వ‌చ్చేస్తున్నాయి. ఇదే క్ర‌మంలో చాలా వెబ్‌సైట్ల‌లో వార్త‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్టు వచ్చేస్తున్నాయి.దీనితో ఏది నిజం ఏది అబద్దం అర్ధం కాక నెటిజెన్ లు ,ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అట.

గూగుల్ ఇలాంటి గాసిప్స్ ప్రచారం చేసే వెబ్ సైట్స్ పై కొర‌డా ఝులిపించింది. అవాస్తవ వార్తలు ప్రచురించే వెబ్‌సైట్స్‌ యాడ్స్‌ ఇవ్వమని సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌, ఫేస్‌బుక్ కఠిన నిర్ణయం తీసుకున్నాయి. సంచలనాల కోసం ప్రచురించే ఇటువంటి వార్తలను చదవి ప్రజలు తప్పుదోవలో నడుస్తున్నారని…ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మీడియా మొత్తం ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ పెట్టించేలా సమాచారం విస్తృతంగా వ్యాప్తికావడంపై వస్తోన్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. అవాస్తవ వార్తలను ప్రచురించి పలు వెబ్‌సైట్లు, ప్రజాభిప్రాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎప్పటికైనా వెబ్ సైట్ లు నిర్వహించే సంస్థలు విషయం ఉన్న వార్తలని, ప్రజలకు ఉపయోగపాడేవి ఇచ్చి,ఒక రూపాయి సంపాదించుకొంటే మంచిది లేదంటే మొదటికే మోసం తప్పదు.