“అమ్మ” సమాధి సాక్షి గా అభిమాని పెళ్లి

Posted December 15, 2016

wedding with jaya pic,jayalalitha ,wedding with jayalalitha photo,women wedding near jayalalitha picపురచ్చితలైవి, అమ్మ గా సుపరిచితం ఐన తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే ఆమె పార్థివ దేహాన్ని ఎమ్జీఆర్ సమాధి పక్కనే జయలలిత సమాధికూడా ఏర్పాటు చేసారు. ఎప్పుడు అమ్మ అభిమానులు ఆమె సమాధి సాక్షిగా పెళ్లిళ్లు చేసుకొంటున్నారు. మామూలుగానే ఆమె సమాధిని చూసేందుకువుంది పెద్ద సంఖ్య లో సందర్శకులు అభిమానులు తాకిడి వుంది,తాజాగా ఇలాంటి వీరాభిమానులు పెళ్లిళ్లు పేరంటాలు చేసుకోవడం తో ఈ ప్రాంతం మరింత సందడి గా మారింది. అంతే కాదు ఇటీవలే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి జయలలిత గుడి కట్టేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం చూసాం, ఇప్పుడు ఇలా పెళ్లిళ్లు మొత్తానికి తమిళనాడు దేవతగా జయలలిత ఆవిర్భావం జరిగింది అనేలా వుంది వీళ్ళ అభిమానం చుస్తే అందుకేనేమో ప్రేమ పిచ్చి తో సమానం అంటారు ..జాతి మత కుల వివక్షత లేకుండా ఇలాంటి అభిమానము పొందండం జయలలితకు సాధ్యం అయ్యింది కావొచ్చు ..అందుకే బ్రతికి ఉండగా అదొక మంచి పని చేయాలి అంటారు ఇందుకే నేమో…

చెన్నై కొళత్తూరుకు చెందిన అన్నాడీఎంకే స్థానిక యువజన విభాగం నాయకుడు ఫ్రాన్సిస్‌ – రెజీలా ప్రీతి అనే యువతితో ఇటీవల పెళ్లి నిశ్చితార్థం జరిగింది. వచ్చే యేడాది ఫ్రిబవరి ఒకటో తేదీన వీరి వివాహం జరగాల్సిఉంది. ఫ్రాన్సిస్‌ తన వివాహ ఆహ్వాన పత్రికను జయలలితకు పంపగా ఆ వివాహానికి తాను హాజరవుతానని మాటిచ్చారు. జయలలిత మృతి చెందటం, ఈ నేపథ్యంలో ఫ్రాన్సిస్ వధువు రెజీలా ప్రీతి, ఇరువైపు కుటుంబీకులను వెంటబెట్టుకుని బుధవారం ఉదయం అమ్మ సమాధివద్దకు వెళ్లారు. అమ్మ సమాధి సాక్షిగా ఫ్రాన్సిస్ రెజీలా ప్రీతి పూలదండలు మార్చుకున్నారు.