అమ్మకు ఏమైంది?

Posted December 5, 2016

what happened to jayalalithaa health
జయలలిత ఆరోగ్యం విషమంగా ఉన్న తరుణంలో తమిళనాడులో హైఅలర్ట్ నెలకొంది. అసలు అమ్మకు ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. జయకు హార్ట్ ఎటాక్ వచ్చిందని చెబుతున్నా… వాస్తవం అది కాకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హడావుడి చూస్తుంటే.. అపోలో ఆస్పత్రి లోపల ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

నిన్న గవర్నర్ విద్యాసాగర్ రావు జయను పరామర్శించడానికి వచ్చారు. ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వస్తుందని భావించారు. కానీ ఎందుకనో అది వాయిదా పడింది. ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రధాని మోడీ చెన్నైలోని అపోలోకు వచ్చి జయను పరామర్శించే అవకాశముందని సమాచారం. అధికారిక ప్రకటన కూడా ఆయనే చేస్తారని చెబుతున్నారు.

అన్నాడీఎంకే ఎమ్మెల్మేలు అత్యవసర సమావేశం కాబోతున్నారు. జయ వారసులెవరు అన్నదానిపై ఇందులో చర్చించే అవకాశముంది. దీని బట్టి జయలలితకు అంత సీరియస్ గా ఉందా? ఉంటే ఎందుకు దాస్తున్నారు? జయ అభిమానులను దృష్టిలో పెట్టుకునే ఈ సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తున్నారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.