జయ బుగ్గ మీద ఆ రంధ్రాలు …?

Posted December 8, 2016

what is that hole on jayalalitha cheekదివంగత తమిళనాడుముఖ్య మంత్రి జయలలిత మృత దేహం మీద ఓ నాలుగు రంధ్రాలు వున్నాయంటూ జోరుగా ప్రచారం ఊపందుకొంటోంది ఏమిటా రంధ్రాలు ? జయలలిత సోమవారమే మృతి చెందారా ఈ విషయాన్నీ భద్రతా కారణాల దృష్ట్యా గోప్యం గా ఉంచారా! ఆ రంధ్రాలు కి మృతికి సంబంధం ఏమైనా ఉందా? ఆమె ఎడమ బుగ్గపై నాలుగు రంధ్రాలు ఆసక్తి రేపాయి. చెంపపైన ఆ రంధ్రాలు ఏంటీ అనే చర్చ జరుగుతోంది.

***ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహం కొన్ని రోజుల పాటు పాడవకుండా, కుళ్లి పోకుండా ఉండేలా వైద్యులు ‘ఎమాల్మింగ్‌’ చేస్తుంటారు. ఈ రంధ్రాలు అందుకేనా .

***మృత దేహాన్ని కొన్ని రకాల రసాయనాలు, మందులతో శుద్ధి చేయడంతో పాటు, బాడీలోకి దేహం కుళ్లిపోకుండా సూది కూడా వేస్తుంటారు. మృతదేహంలోని రక్తాన్ని బయటకు తీసేసి ఈ రసాయన మందును లోనికి పంపే ప్రక్రియ, కానీ ఈ సూదిని మెడ వెనుక లేదా.. గజ్జల్లో వేస్తుంటారు. జయలలిత పార్థీవదేహానికి కూడా ఈ తరహా ప్రక్రియ వైద్యులు నిర్వహించి ఉండే అవకాశాలు ఉన్నాయి.

*** జయలలితకు గుండె పోటు వచ్చినప్పటి నుంచి ఆమె మరణించే సమయం వరకూ వైద్యులు ‘ఎక్మో’ చికిత్స చేశారు.

*** ఆ ప్రక్రియలోనే ఎమాల్మింగ్‌ కూడా నిర్వహించవచ్చు. ప్రత్యేకంగా సూదులు వేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అయితే వీటికి భిన్నంగా జయ బుగ్గలపై ఇలా నాలుగు రంధ్రాలు కనిపిస్తుండటంతో అది ‘ఎమాల్మింగ్‌’ సూదితో ఏర్పడిన రంధ్రాలా.. లేదా ఇతర చికిత్సలు చేయడానికి వీలుగా చేసిన రంధ్రాలా అనేది తెలియడం లేదు ..!