రానా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి…??

0
96
what is the future plan of rana

 Posted April 30, 2017 at 16:57

  • what is the future plan of ranaదగ్గుబాటి వారసుడిగా  ఎంట్రీ ఇచ్చిన రానా కమర్షియల్‌ సినిమాలు చేయడం కాకుండా మంచి పేరును తీసుకువచ్చి నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేశాడు. హీరోగా పలు చిత్రాలను చేసిన రానాకు మంచి గుర్తింపు వచ్చింది. అందువల్లనే ‘బాహుబలి 2’ చిత్రంలో హీరోకు ధీటైన విలన్‌గా ఎంపికయ్యాడు.  ఈ చిత్రంలో రానా నటనకు సినీ విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందాయి. విలన్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా తదుపరి ప్లాన్‌ ఏంటి అని దగ్గుబాటి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. హీరోగా విలన్‌గా అదరగొట్టే రానా నెక్ట్స్‌ సినిమాలో హీరోగా నటిస్తాడా..?? విలన్‌గా నటిస్తాడా..??  అనేది సినీ వర్గాల్లో కూడా ఆసక్తిగా మారింది.
 
‘బాహుబలి 2’ చిత్రంతో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటీనటులందరు కూడా తదుపరి ప్రాజెక్ట్‌లను చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రభాస్‌ కూడా ‘బాహుబలి 2’ క్రేజ్‌ను బట్టి ‘సాహో’ చిత్రాన్ని 150కోట్ల బడ్జెట్‌తో ప్లాన్‌ చేసుకున్నాడు. మరి రానా సంగతి ఏంటి అనేది సందేహంగా మారింది. ‘బాహుబలి 2’ ఇమేజ్‌ రానా వాడుకోవడం లేదు అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఘాజీ’ చిత్రంతో కూడా తన నటనకు మంచి గుర్తింపును పొందిన రానా తదుపరి చిత్రంలో హీరోగానా..?? విలన్‌గానా..?? ఇంకా ఎప్పుడు ఫిక్స్‌ అవుతున్నాడు. అసలు రానాకే క్లారిటీ లేదా అనేది హాట్‌ టాఫిక్‌గా మారింది. రానా ఇప్పుడు హీరోగా, విలన్‌గా ఉండగా ఏ దారి వెతుక్కుంటున్నావు,  నీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నగా మారింది.