ఆ ఛానెళ్లతో నయీమ్ బంధం ఏంటి?

  what relationship between channels nayeem
సిట్ బృందం నయీమ్ డైరీలోని ఒక్కోపేజీ తిప్పేకొద్ది ఒక్కోరి జాతకాలు బయటపడుతున్నాయి.ఆ జాతకాల్ని బయటపెట్టే మీడియా పెద్దల గుట్లు..లోగుట్లు కూడా కనిపించాయట.రేసులో దూసుకెళ్తున్న మూడు చానెళ్ల తో పాటు,మూతపడేందుకు సిద్ధంగా వున్న మరో ఛానల్ కి సంబంధించిన ముఖ్యుల పేర్లు,వారితో జరిపిన లావాదేవీలు స్పష్టంగా డైరీలో వున్నాయట.

మీడియాకి సంబంధించి మొత్తం 69 పేర్లు నయీమ్ డైరీ లోదర్శనమిచ్చాయని పోలీసులు చెప్తున్న మాట .ఆమీడియా పెద్దలు ప్రపంచానికి నీతులు చెప్పి తాము నయీమ్ తో కలిసి భూములకు సంబంధించిన సెటిల్మెంట్లు చేసినట్టు ఆధారాలు లభించాయట .వీరితో కలిశాక మీడియాని వాడుకోవడంపై అవగాహన వచ్చి కాబోలు నయీమ్ కూడా ఓ ఛానల్ పెట్టే ప్రయత్నాలు మొదలెట్టాడట . ఛానల్ పెట్టాక రాజకీయాల్లోకి రావడానికి ఏర్పాట్లు ,ప్రయత్నాలు చేస్తున్నాడట.