కాలచక్రం..

0
107

Posted October 13, 2016

 kalachakram season changing
ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు ..చివరికి సృష్టితో సహా.అయితే ఈ ఉద్భవాన్ని..లయని తనలో దాచుకున్న కాలం మాత్రం అందుకు అతీతం.అందుకే ఆ కాలచక్రం ఎన్నో అద్భుతాలు చేస్తుంది..మరెన్నో అనుభూతులు మిగులుస్తుంది.ఆ అనుభవాల్ని ఆస్వాదించే పసి మనసుంటే ఏదీ కష్టం కాదు..దేనికీ దుఃఖం రాదు.మనం చేయాల్సింది ఆ జీవన మాధుర్యాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండటమే..

వరదలు వచ్చినప్పుడు చీమల్ని చేపలు తింటాయి. అదే వరదలు తగ్గు ముఖం పట్టినప్పుడు, ఆ చేపల్నే చీమలు తింటాయి. దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చేయాలి. అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం. సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే… సబ్బు కావాలి. చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి. ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలి.