2000 నోటు మీద పులి ఏది..?

Posted November 22, 2016

 

2000rs-note

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ కొత్త వివాదానికి తెర లేపారు. 2000 రూపాయల నోటుపై పై నోటుపై జాతీయ జంతువు బెంగాల్‌ టైగర్‌ను ముద్రించలేదని పేర్కొంటూ.. ప్రధాని మోదీ రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు.

‘‘జాతీయ జంతువు రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. రెండు వేల నోటుపై ఏనుగు, జాతీయ పక్షి నెమలి, జాతీయ పుష్పం కమలం బొమ్మలను ప్రత్యేకంగా ముద్రించారు. కానీ, వాటి పక్కన జాతీయ జంతువు బెంగాల్‌ టైగర్‌‌‌కు చోటు కల్పించలేదు. ఆర్‌బీఐ‌ చిహ్నంలో మాత్రమే పులి బొమ్మ ఉంది. ‘ఏనుగు మన జాతీయ వారసత్వం’ అని మోదీ అంటారు. కానీ, ఆయన జాతీయ జంతువును విస్మరించారు. అని విమర్శించారు .