కేసీఆర్, కేటీఆర్ తో భూమా ఏం మాట్లాడుతారు?

Posted November 26, 2016

which matter bhuma nagi reddy discussed with kcr and ktrరాష్ట్రం విడిపోయినా.. పార్టీలు వేరైనా తెలంగాణ‌, ఏపీ నాయ‌కుల మ‌ధ్య సంబంధాలు బాగానే ఉంటున్నాయి. ఎందుకంటే రాజ‌కీయం రాజ‌కీయమే.. స్నేహం స్నేహమే. తాజాగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నోట తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పేర్లు వినిపించాయి. వీరిద్ద‌రి పేర్ల‌ను భూమా ఎందుకు ప్ర‌స్తావించార‌నే క‌దా అనుమానం. అయితే అస‌లు విష‌యంలోకి వ‌ద్దాం.

ఆళ్ల‌గ‌డ్డ‌లో ఏ ప‌ని చేయాల‌న్నా భూమా నాగిరెడ్డి ప‌ర్మిష‌న్ కావాల‌ట‌. ఆయ‌నకు స‌లాం కొడితే త‌ప్ప అక్క‌డ ప‌ని ముందుకు సాగ‌ద‌ని చాలా రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు ఆయ‌నకు సంబంధించిన ఫోన్ సంభాష‌ణ అదే నిజ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ఆళ్లగ‌డ్డ‌లో తెలంగాణ‌కు సంబంధించిన ఓ కాంట్రాక్ట‌ర్ పని తీసుకున్నారు. అయితే దానికి సంబంధించిన ఆయ‌న భూమా నాగిరెడ్డి ప‌ర్మిష‌న్ తీసుకోలేదు. దీంతో రెడ్డిగారికి కోపం వ‌చ్చింది. అంతే స‌దరు కాంట్రాక్ట‌ర్ కు ఫోన్ చేశారు. ఏంటి..? ఏం చేద్దామ‌నుకుంటున్నావు..? అంటూ త‌న‌దైన శైలిలో గ‌ట్టిగానే మాట్లాడారు. అవ‌స‌ర‌మైతే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తోనైనా మాట్లాడ‌తానంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు. నీవు ఎప్పుడూ ఆళ్ల‌గ‌డ్డ‌కు రావా? అంటూ కాంట్రాక్ట‌ర్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఫోన్ సంభాష‌ణ విన్న‌వారు ఇప్పుడు విస్తుపోతున్నారు. అంటే భూమా నాగిరెడ్డి ఫ్యాక్ష‌న్ రాజ‌కీయం ఇంకా త‌గ్గ‌లేద‌ని గుస‌గుస‌లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి నాయ‌కుడిని చంద్ర‌బాబు మ‌రోసారి టీడీపీలో ఎలా చేర్చుకుంది? అని చెవులు కొరుక్కుంటున్నారు.