వైసీపీ క్యాడర్ లో నిరుత్సాహం!!

Posted February 17, 2017

ycp cadder is depressed
ఆంధ్రప్రదేశ్ టీడీపీ క్యాడర్ లో నూతనోత్సాహం కనిపిస్తుంటే.. వైసీపీ క్యాడర్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత బిజీగా ఉన్నా.. పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ… క్యాడర్ లో భరోసా నింపడంలో ముందుంటున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎంతసేపు హైదరాబాద్ కే పరిమితమై క్యాడర్ లో అసంతృప్తికి కారణమవుతున్నారు.

టీడీపీలో ఒకవైపు లోకేశ్ ఇప్పటికే క్యాడర్ తో మమేకమవుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా.. తీరిక దొరికనప్పుడల్లా పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇటు జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.

అసలే వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. క్యాడర్ టీడీపీ వైపు చూస్తోంది. ఈ తరుణంలో పార్టీ నాయకులు, క్యాడర్ ను కాపాడుకోవడానికి కనీసం పార్టీ సమావేశాలు కూడా జరగడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఒకవైపు టీడీపీ మేథమథనం లాంటి సదస్సులు నిర్వహిస్తుంటే.. వైసీపీలో మాత్రం ఆ ఊసే లేదు. ఇలాగైతే కష్టమేనంటున్నారు వైసీపీ క్యాడర్.

పార్టీ మీటింగులు నిర్వహిస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. బలాబలాలపై ఓ అవగాహన వస్తుంది. పార్టీ బలపడుతోందా..?ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి.. ? ఎలా అధిగమించాలి.. ? ఇవన్నీ చర్చించుకునే అవకాశముంది. కానీ జగన్ మాత్రం ఎంతసేపు తాను మీడియాలో కనిపిస్తే చాలు… ఓట్లేస్తారని అనుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే పార్టీ సమావేశాలు నిర్వహించేందుకు ఆయన పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. ఇప్పటికే పార్టీ నాయకులు కూడా ఇదే విషయాన్ని ఆయనతో చెబితే.. ఇప్పుడు ఆ అవసరం లేదన్నట్టు మాట్లాడారట. దీంతో వైసీపీ నాయకులు, క్యాడర్ కూడా షాకయ్యారట. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం కలలు గంటున్న జగన్.. ఇలాగైతే పవర్ లోకి ఎలా వస్తారోనని ఆందోళన చెందుతున్నారని టాక్.