బాబు,చిరు ,జగన్ ఎవరైనా క్లోజ్ …అదే అయన స్పెషల్

Posted December 13, 2016

ycp leader kurasala kannababu close to jagan chandrababu and chiru
ఏ పార్టీలో వున్నామన్నది కాదు ..ఎక్కడున్నా అధినేతకు క్లోజ్ గా వున్నామా లేదా అన్నదే ఆయనకి ముఖ్యం.అయన ఎవరో కాదు …తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు.అయన ఆ పార్టీ లో చేరి కొద్దికాలమే అయినా అప్పుడే జిల్లా అధ్యక్ష పదవి అందుకోగలిగారు.అంతకన్నా వైసీపీ అధినేత జగన్ అంతరంగికుల్లో ఒకరిగా మారిపోయినట్టు తెలుస్తోంది.ఇలా పరిచయం కావడంతో అలా అల్లుకుపోవడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. వాస్తవానికి కురసాలని రాజకీయాల్లో ప్రోత్సహించిన జ్యోతుల నెహ్రు వైసీపీ లో వున్నారు కదాని అయన మాట ప్రకారం జగన్ చెంతకి చేరారు.జ్యోతుల పార్టీని వీడినా వైసీపీ లో నిలదొక్కుకోగలిగారు. జగన్ కి కూడా కురసాల రాజకీయ సలహాలు నచ్చుతాయని అయన అనుచరగణం గర్వంగా చెప్పుకుంటారు.

వైసీపీ కి ముందు కాంగ్రెస్ లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కురసాలని బాగా దగ్గరికి తీశారు.అయన హయాంలో కురసాల ఓ వెలుగు వెలిగిపోయారు.ఇక ప్రజారాజ్యం లో అయితే చిరంజీవి ఎన్నో విషయాల్లో కురసాలని ఎంకరేజ్ చేశారు.అయన సలహాలు,సూచనలకు విలువుండేది.ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు ఎదురైన విమర్శలని దీటుగా తిప్పికొట్టిన నేతల్లో కురసాల ఒకరు.ఇప్పటికీ ఏ పార్టీ లో వున్నా చిరుతో మంచి సంబంధాలే వున్నాయి.అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ప్రజారాజ్యం తోటే అయినా అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్ లుక్స్ లోను ఉండేవారు కురసాల.అలా ఏ పార్టీలో వున్నా అధినేతని ఇట్టే ఆకట్టుకునే కురసాలని సాటి నాయకులు ఆ ట్రిక్ ఏంటో చెప్పమని సరదాగా అంటుంటారట.ఆ స్పెషాలిటీ చెప్పేస్తే కురసాలకి ..మిగతా నాయకులకి ఏమి తేడా ఉంటుంది?