వైసీపీ ఎమ్మెల్యేలతో బాబు ఏమన్నారు?

Posted November 26, 2016

Image result for chandrababu naidu

30 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు …ఒక్క ముఖ్యమంత్రి భేటీలో ఏమి జరిగివుంటుంది?రాష్ట్రమంతటా ఇదే ఆలోచన.అయితే ఆ కుతూహలాన్ని అలాగే కొనసాగించకుండా ఆ భేటీ లో జరిగినదాని గురించి బయటికి వచ్చింది.కానీ బయటకి ఒకటే విషయం రాలేదు.రెండు వైపుల నుంచి రెండు మాటలు వచ్చాయి.ఇప్పుడు అందులో ఏది నిజమో తేల్చుకునే పని జనాల మీదే పడింది.ఒకే వార్తని సాక్షి,ఆంధ్రజ్యోతి లో చదివితే ఎంత అయోమయం పుడుతుందో ఇప్పుడు అలాగే తయారైంది పరిస్థితి.

నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఓ గ్రూప్ గా సీఎం బాబు దగ్గరకెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యేలు తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టారు.బాబు నుంచి సానుకూల సంకేతాలు రాలేదని …ఆయనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని దాని సారాంశం.ఇందులో వింతేమీ లేదు..కానీ ఆ తరువాతే టీడీపీ వైపు నుంచి ఓ లీక్ వచ్చింది.రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోలేకపోతున్నామని వైసీపీ ఎమ్మెల్యేలు బాబు దగ్గర బాధపడ్డారని ఆ లీక్ ద్వారా వెల్లడైంది.ఇలాంటివి వస్తాయనే ఓ గ్రూప్ గానే వెళ్ళమని వైసీపీ అధినేత ముందుగానే తమ ఎమ్మెల్యేలకు షరతు పెట్టారట.ఓ గుంపుగా వెళ్ళాక కూడా అదే రూమర్ పుట్టింది.ఇదంతా చూస్తుంటే ఇది రెండు పార్టీ లు ఆడుతున్న మైండ్ గేమ్ అనిపించడం లేదూ?
[wpdevart_youtube]HlSeNMkned4[/wpdevart_youtube]