రేపే టీడీపీ లోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే ?

Posted December 22, 2016

ycp pamarru mla Uppuleti kalpana join tdp party tomorrow
కృష్ణా జిల్లా,పామర్రు కి ప్రాతినిధ్యం వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పార్టీ మారుతారంటూ కొన్నాళ్లుగా సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతోంది.ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆమె నిన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కళా వెంకటరావు ని కలిశారు.దీంతో ఆమె పార్టీ మారడం ఇక లాంఛనమేనని తేలిపోయింది.ఇప్పుడు పార్టీ మారే ముహూర్తం కూడా ఖరారైంది.రేపు సీఎం చంద్రబాబు సమక్షంలో కల్పన పచ్చ కండువా కప్పుకోనున్నారు.ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరించారు.

నిన్న సాయంత్రం పామర్రులో వైసీపీ,తెలుగుదేశం లోని ముఖ్యనేతలతో ఆమె కల్పన సమావేశమయ్యారు.నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వున్నా తప్ప అభివృద్ధి చేయలేకపోతున్నాన్నన్న బాధ తోటే పార్టీ మారడానికి నిర్ణయించుకున్నట్టు చెప్పారు.అభివృద్ధే లక్ష్యం గా పార్టీ మారుతున్న తనతో కలిసి వచ్చే వైసీపీ నేతల భవిష్యత్ గురించి ఆమె హామీ ఇచ్చారు.