సర్కార్ పై కాలు దువ్వుతున్న ycp…

chevi

ఏపీ అసెంబ్లీలో పోడియం ముందు చేరి నిర‌స‌న వ్య‌క్తం చేస్తోన్న ప్ర‌తిప‌క్ష ఎంఎల్ ఏల‌పై మార్ష‌ల్స్ దాడి చేశార‌ని చెవిరెడ్డి మీడియా పాయింట్ వ‌ద్ద ఆరోపించారు. స‌భ‌లో హోదా గురించి చ‌ర్చ జ‌ర‌పాల‌ని మేము ఆందోళ‌న చేస్తుండ‌గా మార్ష‌ల్స్ దౌర్జ‌న్యానానికి పాల్ప‌డ్డార‌ని పేర్కొన్నారు. అధికార ప‌క్షం త‌మ‌పై దాడుల‌కు ప్రోత్స‌హిస్తోంద‌ని విమ‌ర్శించారు.-

sridhar

హోదాపై చ‌ర్చ‌కు అనుమ‌తిచండం లేదు-కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి
ఏపీ అసెంబ్లీలో హోదాపై చ‌ర్చ‌కు స్పీక‌రు అనుమ‌తించ‌డం లేదు. ఆ అంశం అంటేనే అధికార ప‌క్షం భ‌య‌ప‌డుతోంది. దీనికి మేము నిర‌స‌న తెలుపుతున్నా. ముందుగా సీఎం స్టేట్‌మెంటుకు మేము అంగీక‌రించేది లేదు. స్టేట్‌మెంట్ త‌రువాత స‌భ‌ను వాయిదా వేసే ప్ర‌మాదం ఉంది.

komity హోదాపై చ‌ర్చ అవ‌స‌రం-విశ్వేశ్వ‌ర‌రెడ్డి

హోదా గురించి మేము చ‌ర్చ కోరుతున్నాం. స్టేట్‌మెంట్ ఇస్తామ‌ని టీడీపీ చెబుతోంది. నిర‌స‌న తెలుపుతోన్న ప్ర‌తిప‌క్ష ఎంఎ్ ఏల‌పై మార్ష‌ల్స్ దౌర్జ‌న్యానాకి పాల్ప‌డుతున్నారు. స్పీక‌రు ముందే దౌర్జ‌న్యాలు కొన‌సాగుతున్నాయి. మా వాణిని నొక్కుతున్నారు.