గాలిఇంటి పెళ్ళిలో కాబోయే సీఎంల చర్చ?

Posted November 16, 2016

yedyurappa to attend gali wedding
ఎన్ని విమర్శలొచ్చినా కాబోయే సీఎం ఒకరు గాలి ఇంటి పెళ్ళికి వెళ్లి తీరుతానంటున్నారు. అయన మరెవరోకాదు కర్ణాటక మాజీ సీఎం,మళ్లీ వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బీజేపీ ఫోకస్ చేస్తున్న యెడ్యూరప్ప.గాలి ఇంటి పెళ్ళికి వెళ్లోద్దని బీజేపీ అధిష్ఠానం సంకేతాలు పంపిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో యెడ్డీ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది.హైకమాండ్ నుంచి అలాంటి సందేశం రాలేదంటున్న యెడ్డీ గాలి ఇప్పటికీ బీజేపీ మనిషేనని చెప్పారు.ఒకప్పుడు అవినీతిపరుల కొమ్ము కాస్తున్నారనే వివాదం మీదే బీజేపీ కి ఎడ్డీ కి మధ్య దూరం పెరిగింది.మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తున్నా ఎడ్డీ దూకుడుగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇక సీఎం పీఠం కోసమే అలుపెరగని పోరాటం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ కూడా రాబోయే విమర్శల్ని పక్కనబెట్టి గాలి ఇంటి పెళ్ళికి వెళ్ళబోతున్నట్టు సమాచారం.వైసీపీ శ్రేణులు ఎప్పుడైనా కాబోయే సీఎం అనగానే జగన్ మోములో మెరుపులు,పెదాలపై నవ్వులు దాగాలన్న దాగవు.అలాంటి జగన్ కూడా గాలి ఇంటి వివాహ వేడుకకి వస్తున్నారు.అనుచరులు కాబోయే సీఎం అని చెప్పుకునే ఎడ్డీ,జగన్ గాలి ఇంటి పెళ్ళిలో మాట్లాడుకునే అవకాశాలు లేకపోలేదు.ఇటీవల సోషల్ మీడియా లో ఎడ్డీ,వైసీపీ నేత విజయసాయి ఓ ఆధ్యాత్మిక క్షేత్రంలో కలిసి మాట్లాడుకుంటున్న ఫోటో అందరూ చూసిందే. బీజేపీ,జగన్ మధ్య బంధానికి ఎడ్డీ ప్రయత్నించారని కూడా ఓ టాక్. అయితే అది సక్సెస్ కాకపోయినా ..మళ్లీ ఈ పెళ్లివేడుకల దౌత్యం లో మరో ప్రయత్నం జరగొచ్చేమో!